డీజే భామ కాజ‌లే... క‌న్ఫ‌మ్‌!

నేను ప‌క్కా లోక‌ల్...  అంటూ  `జ‌నతా గ్యారేజ్‌`లో స్పెష‌ల్‌గా వేడి పుట్టిస్తున్న కాజ‌ల్  మ‌రో సూప‌ర్  ఛాన్స్ కొట్టింది. అల్లు అర్జున్ స‌ర‌స‌న `డీజే`లో న‌టించ‌బోతోంది.  హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న అల్లు అర్జున్ `డీజే.. దువ్వూరి జ‌గ‌న్నాథ‌మ్‌` ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. అందులో క‌థానాయిక‌గా ఎవ‌రు న‌టిస్తార‌నే విష‌యంపై మొన్న‌టిదాకా ప‌లు సందేహాలు ఉండేవి. మొద‌ట్లో శ్రుతిహాస‌న్ న‌టిస్తుంద‌ని ప్ర‌చారం సాగింది. కానీ ఆ అవ‌కాశం కాజ‌ల్‌కే ద‌క్కింది. ఇప్పుడున్న క‌థానాయిక‌ల్లో అంద‌రూ కూడా బిజీగానే ఉన్నారు. స్టార్ క‌థానాయిక‌ల్లో ఎవ్వ‌రి కాల్షీట్లూ ఖాళీగా క‌నిపించ‌డం లేదు. అందుకే దిల్‌రాజు కాజ‌ల్‌ని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. అల్లు అర్జున్‌, కాజ‌ల్ జోడీ కొత్త‌గానే ఉంటుంది. వీళ్లిద్ద‌రూ ఇదివ‌ర‌కు ఆర్య‌2, ఎవ‌డుల్లో మాత్ర‌మే న‌టించారు. ఎవ‌డులో ఇద్ద‌రూ క‌నిపించేది కాసేపే. సో... ఆ కాంబో ఆస‌క్తిక‌రంగానే ఉంటుంద‌ని వెంట‌నే సెట్ చేశాడు దిల్‌రాజు. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌వ్వ‌బోతోంది. 
kajalagarwal
kajal for bunny
kajal pair up with bunny
duvvada jagannadham