జులై 1 న విడుదలవుతున్న 'టార్జాన్'!

వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ సమర్పణలో అత్యంత భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించే స్థాయిలో అత్యద్భుతమైన విజువల్ వండర్స్ తో రూపొందిన హాలీవుడ్ ఫిల్మ్ 'ది లెజెండ్ ఆఫ్ టార్జాన్'. తెలుగులో ఎన్నో హిట్ సినిమాలను అందించిన మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేతలు ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా..
సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత పరాజ్ జైన్ మాట్లాడుతూ.. ''జులై 1 న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఆంధ్రా, తెలంగాణ, సీడెడ్ ఇలా అన్ని ప్రాంతాల హక్కులను మేమే పొందాం. నిజానికి ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయాల్సింది కానీ 2కె ఫార్మట్ టెక్నాలజీ ఉన్న థియేటర్లు మన దగ్గర 150 మాత్రమే ఉన్నాయి. అందుకే 150 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమా టార్జాన్, అందులో ఉండే సబ్జెక్టు తెలుగు వారిని బాగా ఆకర్షిస్తుంది. ఫ్యామిలీతో చూడదగ్గ చక్కని చిత్రమిది. ఈ చిత్రాన్ని 3డి, 2డి వెర్షన్స్ లో విడుదల చేస్తున్నాం'' అని చెప్పారు.
ఈ హాలీవుడ్ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే: రైస్ బరోగ్స్, క్రెయిస్ బ్రెవర్ &ఆదాంకోజడ్, సంగీతం: రూపెర్ట్ గ్రెగ్ సన్, విలియమ్స్, ఎడిటింగ్: మార్క్ డే, ఫొటోగ్రఫీ: హెన్రీ బ్రాహం, కథా విస్తరణ: ఎడ్ గర్, దర్శకత్వం: డేవిడ్ యేట్స్







































