దాసరి ప్రారంభించిన 'డబ్బా శీను'!

బాబు నాయక్ హీరోగా అమూల్య ప్రొడక్షన్స్ సమర్పణలో వరంగల్ టాకీస్ బ్యానర్ పై రఘు పూజారి దర్శకత్వంలో గుర్రపు విజయ్ కుమార్ నిర్మిస్తోన్న చిత్రం 'డబ్బా శీను'. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. చిత్ర ముహూర్తపు సన్నివేశానికి దర్శకరత్న దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా, ప్రతాని రామకృష్ణ గౌడ్ కెమెరా స్విచాన్ చేశారు. సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..
దర్శకరత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ''చిన్న నటులే పెద్ద హీరోలుగా మారుతున్నారు. బాబు నాయక్ లో మంచి టాలెంట్ ఉంది. ఈరోజుల్లో సినిమా చేయడం చాలా సులువు అయిపోయింది. కాకపోతే దాన్ని చక్కగా ప్రోమోట్ చేసి విడుదల చేయాలి. ఈ చిత్ర దర్శకనిర్మాతలకు నా అభినందనలు. ఈ సినిమా సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ''బాబు నాయక్ చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ.. నటుడిగా ఎదుగుతున్నాడు. ఈ సినిమాతో తను హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ టైటిల్ అతనికి సరిగ్గా సరిపోతుంది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.
ఈ చిత్రంలో బాబు నాయక్ సరసన కులకర్ణి మమత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో చలపతిరావు, కవిత, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, జూనియర్ రేలంగి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాక్ షకీల్, నిర్మాత: గుర్రపు విజయ్ కుమార్, దర్శకత్వం: రఘు పూజారి.







































