ముగ్గురమ్మాయిల‌తో నిఖిల్..!

నిఖిల్ జోరు మామూలుగా లేదు. వ‌రుస‌గా విజ‌యాలు అందుకుంటున్నాడు. మార్కెట్‌ని బాగా పెంచుకొన్నాడు. అందుకే ఆయ‌నతో సినిమాలు తీసేందుకు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఎక్క‌డ‌లేని ఉత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆ డిమాండ్‌ని నిఖిల్ కూడా బాగానే స‌ద్వినియోగం చేసుకుంటున్నాడు. విరామం రాకుండా కొత్త సినిమాల్ని ఎంచుకొంటున్నాడు. వ‌చ్చే నెల‌లో శంక‌రాభ‌ర‌ణం విడుద‌ల కాబోతోంది. ఇంత‌లో నిఖిల్ కొత్త సినిమాకోసం రంగంలోకి దిగేందుకు సిద్ధ‌మ‌య్యాడు. సందీప్‌కిష‌న్‌తో టైగ‌ర్ అనే సినిమాని తీసిన మురుగ‌దాస్ శిష్యుడు ఆనంద్‌తో ఓ సినిమా చేయ‌డానికి నిఖిల్ ఒప్పేసుకొన్నాడు.  సోషియో ఫాంట‌సీ చిత్రంగా రూపొంద‌నున్న ఆ చిత్రంలో ముగ్గురు హీరోయిన్ల‌కి చోటుంద‌ట‌. తాప్సి, అవికాగోర్‌ల‌ను ఇప్ప‌టికే ఎంపిక చేసుకున్న‌ట్టు తెలిసింది. త్వ‌ర‌లో మూడో క‌థానాయిక ఎంపిక కూడా పూర్త‌వుతుంద‌ట‌. ఆ వెంట‌నే కొబ్బ‌రికాయ కొట్టేస్తార‌ని తెలిసింది. 
ఇప్ప‌టిదాకా ఆయ‌న సింగిల్ హీరోయిన్‌తోనే ఆడిపాడాడు. ఇప్పుడు ఇద్ద‌రితో కూడా కాదు, ఏకంగా ముగ్గురు భామ‌ల‌తో రొమాన్స్ చేయ‌బోతున్నాడు. ఈ లెక్క‌న నిఖిల్ డ‌బుల్ ప్ర‌మోష‌న్ అందుకొన్న‌ట్టే.  అంతా ఓకే కానీ, ఇందులో తాప్సిని ఎంచుకోవ‌డమేంట‌న్న‌దే ఆశ్చ‌ర్య‌ర‌కంగా మారింది. తాప్సి సీనియ‌ర్ల‌తో క‌లిసి న‌టించింది. నిఖిల్ స‌ర‌స‌న మ‌రీ ముదురుగా క‌నిపించే ప్ర‌మాదం లేదూ! కానీ చిత్ర‌బృందం మాత్రం ధీమాగా తాప్సిని ఎంచుకొంది. మూడో క‌థానాయిక ప్లేస్‌ని కూడా స్వాతితోనే ఫిల్ చేస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. స్వాతితో ఇదివ‌ర‌కు స్వామిరారా, కార్తికేయ చిత్రాల్లో న‌టించాడు నిఖిల్‌. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి క‌లిసి న‌టించ‌బోతున్నార‌న్న‌మాట‌. 
nikhil new movie
tapesee
avika gor
vi anandh
murugadas
nikhil