సూర్య చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న నితిన్.!

తను చేయబోయే క్యారెక్టర్ కోసం తన శరీరాన్ని ఎన్ని విధాలుగా మార్చుకోవడానికైనా సిద్ధపడే హీరో సూర్య. రొటీన్ సినిమాలకు భిన్నంగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చెయ్యడమే లక్ష్యంగా సినిమాలు తీసే దర్శకుడు విక్రమ్ కె.కుమార్. 13, ఇష్క్, మనం వంటి డిఫరెంట్ మూవీస్‌తో డైరెక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విక్రమ్ ఇప్పుడు సూర్యతో '24' అనే చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సూర్య సరసన సమంత, నిత్య మీనన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మరో డిఫరెంట్ పాయింట్‌తో తెరకెక్కిస్తున్నాడు.
ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రైట్స్‌ను హీరో నితిన్ సంస్థలు శ్రేష్ఠ్ మూవీస్, గ్లోబల్ ఫిలింస్ దక్కించుకున్నాయి. డిసెంబర్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషమేమిటంటే ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ చెయ్యడం. ఈమధ్యకాలంలో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ చెయ్యడం చాలా ప్లస్ అవబోతోంది. హీరో సూర్యకి, డైరెక్టర్ విక్రమ్‌కి ఈ సినిమా డెఫినెట్ మంచి పేరు తెస్తుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.







































