అన్న సినిమాలో తమ్ముడి ఫిగర్‌..!

       ఇట్టాగే రెచ్చిపోదాం... అంటూ ‘టెంపర్‌’లో ఎన్టీఆర్‌ని ఉచ్చులోకి దింపిన ఐటెమ్‌గాళ్‌ నోరా ఫతేహి గుర్తుంది కదా. ఈ కెనడా భామ నడుమొంపుల్ని చూశాక తెలుగు ప్రేక్షకుల మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. ఐటెమ్‌కే ఐటెమ్‌ చూపించిన  ఘనత ఈ పాటకి దక్కింది. దీంతో రాజమౌళి సైతం నోరాకే ఓటేసి తన ‘బాహుబలి’ చిత్రంలో ఓ పాట చేయించాడు. అందులో ఎలాంటి ఐటెమ్‌ చేసిందో చూడాలి. అన్నట్టు తమ్ముడు ఎన్టీఆర్‌తో ఆడిపాడిన ఆ ఐటెమ్‌ పాపని తన సినిమాకోసం బుక్‌ చేశాడు అన్నయ్య  కళ్యాణ్‌రామ్‌. 
 పటాస్‌ విజయంతో జోరుమీదున్న కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా ‘షేర్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మాంచి కిక్కిచ్చే ఓ ఐటెమ్‌ పాట ఉందట. ఆ పాటకోసం నోరా ఫతేహిని ఎంపిక చేశారు. ఆ విషయాన్ని కళ్యాణ్‌రామ్‌, నోరా కూడా కన్ఫర్మ్‌ చేశారు. ఆ పాట  కిక్కాస్‌గా ఉంటుందని నోరా చెబుతోంది.
nora fathehi
temper
kalyan ram
bahubali
ntr
puri jaganath
nora fatehi for kalyanram movie