'అనేకుడు' మూవీ సక్సెస్ మీట్ ..!

ధనుష్‌, అమైరా దస్తూర్‌ జంటగా ఎ.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కల్పాతి ఎస్‌.అఘోరమ్‌, కల్పాతి ఎస్‌.గణేష్‌,కల్పాతి ఎస్‌.సురేష్‌ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'అనేకుడు'. కె.వి.ఆనంద్ దర్శకుడు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమా ఇటీవల తెలుగులో విడుదలయ్యి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ నేపధ్యంలో ఆదివారం హైదరాబాద్ లో ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎన్.వి.ప్రసాద్, దర్శకుడు కె.వి.ఆనంద్, సంగీత దర్శకుడు హరీష్ జయరాజ్, పాటల రచయిత సాహితీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కె.వి.ఆనంద్ మాట్లాడుతూ "తమిళంలో ఈ సినిమాకు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో తెలుగులో కూడా అంత మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అధ్బుతంగా అందించారు. కార్తిక్, ధనుష్ వంటి స్టార్ హీరోల సరసన ఓ చాలెంజింగ్ పాత్రలో అమైరా ఒదిగిపోయి నటించింది. ఈ సినిమాను ఇంత బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు" అని తెలిపారు.
ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ "తమిళనాట విడుదలయ్యి సంచలన విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో విడుదలయ్యి మొదటి మూడు రోజుల్లో 2 కోట్లను కలెక్ట్ చేసి నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టింది. మెగాసూపర్ గుడ్ ఫిల్మ్స్ తరపున ప్రేక్షకులకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.
హరీష్ జయరాజ్ మాట్లాడుతూ "ఇది కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమా. నాలుగు కథలను తీసుకొని నాలుగు కాలాలకు చెందిన నాలుగు జనరేషన్స్ వారికి సంబంధించిన కథను తెరకెక్కించి డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ఈ చిత్రంలో పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇంత పెద్ద సక్సెస్ లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.
సాహితీ మాట్లాడుతూ "అన్ని వర్గాల వారిని అలరించే సినిమా ఇది. ఈ సినిమాలో బర్మాకు సంబంధించిన కథ అధ్బుతంగా వచ్చింది. ఒకొక్క ఫ్రేమ్ బొమ్మలాగా తీర్చిదిద్దారు. నేను రాసిన 'బంగ్లగూడ రౌడీ' పాటకు మంచి స్పందన లభించింది" అని అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, ఎడిటింగ్: అంటోనీ

anekudu movie
success meet
n.v.prasad
k.v.anadh
harish jayaraj