'లేడీస్ అండ్ జెంటి మెన్

ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మరియు డా.ఎం.వి.కె రెడ్డి, షిర్డీ సాయి కంబైన్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మించిన చిత్రం ''లేడీస్ అండ్ జెంటిల్ మెన్". ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో మరియి ఓవర్ సీస్ లో జనవరి 30 న విడుదల అవుతుంది. పి.బి.మంజునాథ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రఘు కుంచె అందించిన "లేడీస్ అండ్ జెంటి మెన్"  చిత్రం ఆడియోకి ఇంటర్నెట్ లో పది లక్షల డిజిటల్ హిట్స్ వచ్చి, శ్రోతల నుండి విశేష స్పందన లభించింది. ఈ చిత్ర విడుదల సందర్భంగా నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ "రేపే ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది. ఫోన్ ద్వారా రేపటి రిలీజ్ పోస్టర్ ని డిజిటల్ లాంచ్ చేస్తున్నాం. ఇది ఒక ఎమోషనల్ కథ. సోషల్ నెట్ వర్కింగ్ వల్ల ఫ్యామిలీ రిలేషన్స్ బాగా దెబ్బతింటున్నాయి. అదే కాన్సెప్ట్ గా తీసుకొని ఈ సినిమా తీసాం. తోడు కోసం వెతికే ఓ స్టూడెంట్, సంతోషం కోసం వెతికే ఓ భార్య, మనీ కోసం వెతికే ఓ కాల్ సెంటర్ ఉద్యోగి మీదే కథ మొత్తం నడుస్తుంది. 'బ్యాక్ బెంచ్ స్టూడెంట్' సినిమా కి నాతో కలిసి పని చేసిన మంజునాథ్ ని దర్శకునిగా ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నా" అని చెప్పారు.

దర్శకుడు మంజునాథ్ మాట్లాడుతూ "తెలుగు సినిమాలలో మొదటి సారిగా సైబర్ క్రైమ్ మూవీ వస్తుంది. వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని తీసిన సినిమా ఇది. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది" అని అన్నారు. 

madura sreedar reddy
manjunath
ladies and gentleman movie release