పులివెందులలో వైసీపీ కి భారీ షాక్
BIG Shock To YSRCP
సొంత నియోజక వర్గం పులివెందులలో కూటమి జెండా ఎగరవేస్తుంది, తన పరువు పోతుంది అని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓటు వెయ్యకుండా, రోడ్డు ఎక్కి ర్యాలీలు చేస్తూ, కింద కూర్చుని రచ్చ చెయ్యడం, హెలికాఫ్టర్ కి పర్మిషన్ ఇవ్వలేదు, పులివెందులలో కూటమి హింసకు పాల్పడుతుంది అంటూ ఎలాగైనా పులివెందులలో రీ-పోలింగ్ జరిపించాలని కలలు కన్న జగన్ కు ఏపీ హై కోర్టు షాకిచ్చింది.
పులివెందులలో జరిగిన ఓటింగ్ నిలిపివెయ్యాలని వైసీపీ పార్టీ హై కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హై కోర్టు ఈరోజు ఉదయం తీర్పుని వెలువరించింది. పులివెందులలో ఎలాంటి హింస జరగలేదు, ఓటింగ్ సరళి సజావుగా సాగింది అని హై కోర్టు పులివెందుల రీ పోలింగ్ కి నిరాకరించింది.
అంతేకాదు ఈరోజు మంగళవారం ఉదయం పులివెందుల ఓట్ల లెక్కిపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దానితో వైసీపీ కి అలాగే జగన్ కి భారీ షాక్ తగిలింది. కంచుకోటలో కూడా ఓటమి తప్పదని గ్రహించే జగన్ ఇలాంటి నాటకాలు ఆడి రీ పోలింగ్ కోసం ఎదురు చూసారు. కానీ హై కోర్టు జగన్ కు ఝలక్ ఇచ్చింది.















































