ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu 10 : Mukesh’s promise to Rohit

BB10: త్రిగుణ్ ని తొక్కేస్తా.. రోహిత్ కి ముఖేష్ ప్రామిస్

Bigg Boss Telugu 10 : Mukesh’s promise to RohitBigg Boss Telugu 10 : Mukesh’s promise to Rohit


బిగ్ బాస్ సీజన్ 10 లో కప్ గెలుస్తాడు, విన్నర్ మెటీరియల్ అనుకున్న కామనర్ రోహిత్ నాయుడు హౌస్ మేట్స్ సపోర్టు లేక ఎలిమినేట్ అవడం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. రోహిత్ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ ఆయన అభిమానులే కాదు బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుకునే వాళ్ళు కూడా నెత్తి నోరు కొట్టుకున్నారు.

ఇక హౌస్ లో షాలిని తో తప్ప మరెవ్వరితో స్నేహం చెయ్యని రోహిత్, షాలిని ఎలిమినేట్ అయ్యాక తనకు నచ్చని ముఖేష్ బ్యాచ్ తో స్నేహం మొదలెట్టాడు. హౌస్ లో తొలివారాల్లో ముఖేష్, సుధీర్ లను చాలా చిన్న చూపు చూసి తీసిపారేసిన రోహిత్ చివరికి చేసేదిలేక వాళ్ళతోనే కలిసాడు.

ఆ స్నేహం వారానికే ఎండ్ అయ్యింది. రోహిత్ వచ్చేసాక నిన్న సోమవారం జరిగిన నామినేషన్స్ లో త్రిగుణ్ కి ముఖేష్ కి ఆర్గ్యూ జరిగిన సందర్భంలో నేను త్రిగుణ్ని తొక్కి గెలుస్తా, నా గెలుపును ఆపలేరు, రోహిత్ నువ్వు చూస్తున్నావో లేదో తెలియదు.. నేను నీకు ప్రామిస్ చేస్తున్నా త్రిగుణ్ ని తొక్కేసుకుంటూ పోయి గెలిచి చూపిస్తా అంటూ రెచ్చిపోయాడు.

ఇక త్రిగుణ్ తగ్గడుగా.. ముకేష్ నువ్వు వెళ్లిన ఒకరోజు తర్వాతే నేను బయటకు వెళ్తాను అంటూ త్రిగుణ్ రెచ్చిపోయాడు. ఇలా గత రాత్రి నామినేషన్స్ లో త్రిగుణ్ vs ముఖేష్ అన్న రేంజ్ లో గొడవలు జరిగాయి. 

Bigg Boss Telugu 10: Thrigun vs Mukhesh Gowda