నిజం గెలిచింది: మంత్రి లోకేష్ ఎమోషనల్ ట్వీట్

Truth Has Prevailed, Says Nara LokeshTruth Has Prevailed, Says Nara Lokesh


వైసీపీ ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి మాజీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు పై కక్ష కట్టి జైలుకు పంపించి నేటికి మూడేళ్లవుతుంది. మాజీ సీఎం అని కూడా చూడకుండా అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టి  53 రోజులపాటు, వేడుకచూస్తూ  బయట పండగ చేసుకున్నారు. ఏ మచ్చ లేని వ్యక్తిని జైలుకు పంపిస్తే ఏమవుతుందో అనేది ఏపీ ప్రజలు సీఎం స్థానంలో ఉండి వేడుక చూసిన జగన్ కు అసలు సినిమా చూపించారు.

కేవలం ఆంధ్ర ప్రజలే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు నిజం గెలవాలి, న్యాయం గెలవాలి అంటూ చంద్రబాబు కి మద్దతుగా నిలిచారు. నిజంగా నిజం గెలిచింది. చంద్రబాబు ఏ తప్పు చెయ్యలేదు అని కోర్టు తీర్పు ఇవ్వడమే కాదు 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు తో సీఎం గా ప్రమాణ స్వీకారం చేసారు.

అదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేస్తూ.. తెలుగు ప్రజలకు మరోమారు కృతఙ్ఞతలు తెలిపారు.

గొడ్డలి పార్టీ రాజకీయ కక్ష సాధింపుల కోసం మూడేళ్ల క్రితం @ncbn గారిని అక్రమ కేసులో నిర్బంధించింది సరిగ్గా ఈ రోజే. నాటి నుండి 53 రోజులపాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి మొత్తం "నిజం గెలవాలి" అంటూ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచింది. నిజం గెలిచింది, చంద్రబాబు గారు నిర్బంధం నుంచి విడుదలయ్యారు. అక్రమ కేసులన్నీ న్యాయస్థానాలు కొట్టేశాయి. నిజం గెలిచింది. నాటి చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ.. తెలుగుజాతి మద్దతుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.. అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేసారు.
 

Nara Lokesh