మెగా డీఎస్సీపై ఆరోపణలన్ని నిరాధారమే

Mega DSC

 

మెగా డీఎస్సీ-2025పై వైసీపీ పార్టీ చేస్తున్న రచ్చ, జరుగుతున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి తుది ఎంపిక వరకు మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల ప్రకారమే నిర్వహించామని ప్రభుత్వం వెల్లడించింది.

అన్ని జాగ్రత్తలు తీసుకుని TCS ION డిజిటల్ ప్లాట్ఫామ్, 256-బిట్ ఎన్క్రిప్షన్, ర్యాండమైజేషన్ వంటి అత్యాధునిక భద్రతా వ్యవస్థలతో పరీక్షలు నిర్వహించామని తెలిపింది. 42 వేల ప్రశ్నల బ్యాంక్, పరిమిత యాక్సెస్, బహుళ భద్రతా చర్యల వల్ల పేపర్ లీక్ కు అవకాశం లేదని స్పష్టం చేసింది.

మూడు స్థాయిల గ్రీవెన్స్ పరిష్కార వ్యవస్థ ద్వారా వేలాది అభ్యర్థుల ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించినట్లు తెలిపింది.
మెరిట్ లిస్టులు, ఆన్సర్ కీలు, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను అధికారిక వెబ్ సైట్  అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.

2025 ఏడాదిలో రికార్డు స్థాయిలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని కేవలం 148 రోజుల్లో పూర్తి చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల కృషిని అవమానించేలా తప్పుడు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని ప్రభుత్వం విమర్శించింది. గత ప్రభుత్వంలో మెగా డీఎస్సీ హామీలు అమలు కాలేదని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని కార్యరూపంలోకి తీసుకొచ్చిందని పేర్కొంది.

మెగా డీఎస్సీపై ఎంత ప్రచారం జరిగినా, మొత్తం నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రతి దశ రికార్డుల్లోనే ఉందని ప్రభుత్వం పునరుద్ఘాటించింది.

AP TET to DSC