AK 47: చిట్టిబాబు సింపుల్ అండ్ స్వీట్
Venkatesh exudes charm as Chitti Babu from AK47
త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే క్లాస్, అదిరిపోయే డైలాగ్స్. త్రివిక్రమ్ స్టయిల్ అదే. గుంటూరు కారం తర్వాత లాంగ్ గ్యాప్ తో వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఆదర్శ కుటుంబం చిత్రం అక్టోబర్ 2 న విడుదలకు ముహూర్తం పెట్టడమే కాదు.. అప్పుడే ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు.
అందులో భాగంగా ఆదర్శ కుటుంబం నుంచి వీడియో వదిలారు. శ్రీనిధి శెట్టి వెంకీ భార్యగా కనిపించింది. రఘుబాబు తో ఎప్పుడో పెళ్లప్పుడు నవ్వింది.. మళ్లీ ఇప్పటి వరకూ నవ్వలేదు అంటూ వెంకీ చిట్టిబాబు పాత్రతో చెప్పిన డైలాగ్ హైలెట్ అయ్యింది, మరో వీడియో లో ఇంట్లో కిచెన్ లో ఏసీ ఉంది అంటూ శ్రీనిధి శెట్టి ఎగ్జైట్ అవుతూ చెప్పగా.. వంట చేసేది మీరేగా అంటూ వెంకీ తో అనగానే రఘుబాబు విచిత్రంగా చూస్తారు. ఇక ఈ ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా ఉంది, అంటే మీ పని తగ్గుతుంది అంటూ మరోసారి అనగానే వెంకీ అవును నాకు ఎవరు పని చేసినా ఇష్టం ఉండదు.. అంటూ కవర్ చేసుకుంటున్న వీడియో కూడా ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గా ఎక్కేసాయి.
చిట్టి బాబు గా వెంకీ సింపుల్ గానే స్వీట్ గా అకట్టేసుకున్నారు. దర్శకుడు త్రివిక్రం ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ ఆదర్శ కుటుంబాన్ని తెరకెక్కించారు అని ఈ వీడియోస్ చూస్తే తెలిసిపోతుంది.








































