టీడీపీ 45 రోజుల ఇంటింటి ప్రచార కార్యక్రమం
Door-to-door Telugu Desam campaignఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు ఇంటింటి ప్రచారం వంటి భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టీడీపీ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ పిలుపు మేరకు 45 రోజుల పాటు ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో పార్టీ ఎమ్యెల్యేలు, ఎంపీలు, టీడీపీ కార్యకర్తలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలను పలకరిస్తూ వారితో మమేకమవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, ఇతర ప్రజాప్రతినిధులు, లక్షలాది మంది కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన విజయాలను ప్రతి కుటుంబానికి చేరవేస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, వారి అభిప్రాయాలు, సూచనలను నేరుగా స్వీకరిస్తున్నారు.
అంతేకాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే మొదలైన గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో విస్తృతంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.








































