Advertisement

NBK 111 సంక్రాంతి or సమ్మర్ ?

NBK 111: Sankranti or Summer?


నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న NBK 111 నిన్నమొన్నటివరకు ఫుల్ స్వింగ్ లోనే నడిచింది. NBK 111 షూటింగ్ సెట్ లో బాలయ్య కు మోకాలి ఇంజురీ అవడంతో ఆయన మోకాలికి AIG డాక్టర్స్ సర్జరీ చేసారు. దానితో బాలయ్య నాలుగు నుంచి ఐదు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది.

అయితే NBK 111 టార్గెట్ ముందు దసరా.. కానీ షూటింగ్ ఆలస్యమవడంతో NBK 111 రిలీజ్ ప్లాన్స్ డిసెంబర్ కి వెళ్లాయి. రేపోమాపో NBK 111 రిలీజ్ డేట్ లాక్ చేసి ప్రకటిద్దామనుకున్న సమయంలో బాలయ్య ప్రమాదం బారిన పడ్డారు. దానితో NBK 111 షూటింగ్ వాయిదా పడింది. అలాగే రిలీజ్ ప్లాన్స్ కూడా మారిపోయాయి.

బాలయ్య కు కలిసొచ్చిన సంక్రాంతికి NBK 111 రిలీజ్ చేస్తారో, లేదంటే షూటింగ్ ఆలస్యమవడంతో ఆ ప్లాన్స్ ని సమ్మర్ కి షిఫ్ట్ చేస్తారో కానీ నందమూరి అభిమానులు మాత్రం బాలయ్యకు అచ్చొచ్చిన సంక్రాంతి అయితే బెటర్ అంటున్నారు. మరి బాలయ్య తిరిగి కోలుకుని ఎప్పుడు సెట్ లోకి వస్తారో తెలియదు.

ప్రస్తుతం బాలయ్య లేని సీన్స్ ని గోపీచంద్ తెరకెక్కించినా.. బాలయ్య పూర్తిగా కోలుకుని సెట్ లోకి వచ్చాకే NBK 111 డేట్ పై క్లారిటీ వస్తుంది. 

NBK111 release update