Advertisementt

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్

Mon 22nd Apr 2024 02:26 PM
social media   సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్
Social Media సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్
Advertisement
Ads by CJ

నిజమే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పదం ఇప్పుడు ఓ సెన్షేషన్. సమాచార విప్లవం సరికొత్త పుంతలు తొక్కిన ఈ రోజుల్లో న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్లను మించి ప్రత్యేక ఉనికిని చాటుకుంటున్న వాళ్లే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్. 

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలాంటి అంశాన్నైనా అందరికీ అర్థమయ్యేలా సమాచారం ఇస్తారు. దీంతో ఇంటర్నెట్ యూజర్లు వీరికి ఇట్టే అభిమానులుగా మారిపోతున్నారు. సోషల్‌ మీడియాలో వీరి ఫాలోయింగ్‌ మామూలుగా ఉండదు. వాళ్లు పెట్టే వీడియోలు పెద్ద చర్చనీయాంశమవుతాయి కూడా.

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్‌ ఇప్పుడు అన్ని వర్గాలను ప్రభావితం చేయగలుగుతున్నారు. అందుకే వీళ్లు రాజకీయాలపైనా ప్రభావితం చూపుతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ పార్టీలకు సంబంధించి ప్రచారం చేస్తే పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయన్న ప్రచారం జోరుగా ఉంది.

ఇందులో భాగంగానే వైయస్ఆర్‌సీపీ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ తో ప్రచారానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే 23న భీమిలిలో ఇన్ఫ్లుయెన్సర్స్‌తో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వైయస్ఆర్‌సీపీకి అనుబంధంగా పనిచేస్తున్నవారు హాజరవుతారు.

సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా కార్యకర్తలు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే సోషల్ మీడియా నిర్వాహకులు... ఇన్ఫ్లుయెన్సర్స్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రానున్న ఈ కొద్దికాలం మన పార్టీకి ఎంతో విలువైనది. ఈ కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని పార్టీని బలోపేతం చేయడానికి, జగనన్న పాలనలో సాధించిన విజయాలు.. ప్రజలకు దక్కిన సంక్షేమం, వారికి లభించిన రాజకీయ, సామాజిక ప్రాధాన్యం లాంటి అంశాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎలా కృషి చేయాలన్నది ఈ సమావేశంలో సీఎం వైయస్ జగన్ దిశా నిర్దేశం చేస్తారు. 

టీడీపీ, దాని అనుబంధ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం, ప్రభుత్వం నుంచి జరిగిన మంచిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశం మీద ఐక్యంగా నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం ఒక గొప్ప వేదిక కానుంది.

Social Media :

Jagan

Tags:   SOCIAL MEDIA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ