టీడీపీని గెలిపించే క్రమంలో చంద్రబాబు సభలు, మీటింగ్స్ అంటూ ఏపీ రాష్ట్రమంతా హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన గత ఎన్నికల్లో ఓటమికి కారణమైన పలు విషయాల్లో చంద్రబాబు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు అనిపించేలా ఆయన వ్యవహార శైలి ఉంటుంది అంటూ సర్వేలు చెబుతున్నాయి.
నిరుపేదలు.. వయసుమళ్ళిన పెద్దల పట్ల చంద్రబాబు వైనం మరొకరకంగా ఉంది. అసలు సంక్షేమం అంటేనే పాడనీ చంద్రబాబు ఇప్పుడు సీఎం వైయస్ జగన్ సారధ్యంలోని ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి ఓర్వలేకపోతున్నారు.
ప్రతినెలా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంచే వాలంటీర్ల కాళ్లకు కోర్టుల సాయంతో బంధనాలు వేసి చంద్రబాబు తాను గెలిచానని సంబర పడుతున్నారు. కానీ దీనివల్ల వృద్ధులు.. వికలాంగులు.. ఈ మండుటెండల్లో ఎంత ఇబ్బంది పడతారన్నది ఆయన తెలుసుకోలేకపోతున్నారు.
చంద్రబాబు చేసే పనుల వల్ల ఇంటివద్దనే పెన్షన్ తీసుకునే అవకాశం కోల్పోయిన వృద్ధులు.. వికలాంగులు ఇప్పుడు ఆయన విషయంలో కోపంగా ఉన్నారు. ఆయనకు చేయడం చేతకాదు.. చేస్తున్న జగనన్న చేతులు ఇలా ఈసీ నిబంధనలతో కట్టేశారు.. చంద్రబాబుకు మనసు లేదు.. వయసు పెరిగిన మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ నిరుపేదలు బాబు పై ఆగ్రహంతో ఉన్నారు అంటూ వైసీపీ నేతలు చెప్బుతున్నారు.
చంద్రబాబు వైఖరి పేదలకు వ్యతిరేకం అని మరోమారు అర్థమైందని పెన్షనర్లు ఆవేదన చెందుతున్నారు అంటూ వైసీపీ చెబుతుంది. పేదలమీద గెలిచానని చంద్రబాబు అనుకుంటున్నారు ఏమి లాభం... జూదంలో గెలిచినా కౌరవులు కురుక్షేత్రంలో ఓడిపోయారు... అదే విధంగా చంద్రబాబు ఇప్పుడు కోర్టులో గెలిచినా రేపు ఎన్నికల్లో ఓడిపోతారు... మేమే ఓడిస్తాం అని వైసీపీ నేతలతో పాటుగా పెన్షనర్లు చెబుతున్నారు.