Advertisementt

దళితులకు చంద్రబాబు ద్రోహం

Tue 16th Jan 2024 10:16 AM
cbn  దళితులకు చంద్రబాబు ద్రోహం
CBN దళితులకు చంద్రబాబు ద్రోహం
Advertisement
Ads by CJ

దళితుడిగా ఎవరు పుట్టాలనుకుంటారు? అని గతంలో దళితులను అవహేళనగా మాట్లాడిన చంద్రబాబు… ఎప్పుడూ దళితుల మనసు తెలుసుకోలేదు. గతంలో బాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. దళితుల ఓట్లకోసం ఎప్పుడూ తహతహలాడే చంద్రబాబు… వారి అభ్యున్నతికోసం తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడు పాటు పడింది లేదు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి… ఇప్పుడు జగన్ అధికారంలోకి రాగానే దళితుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి… నిత్యం వారికోసం పాటుపడుతున్నాడు. 

చంద్రబాబు మాత్రం వారిని ఎప్పుడూ గుర్తించకపోగా… ఎంతో అనుభవం ఉన్న దళిత వర్గానికి చెందిన నాయకులను అవమానిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. తాజాగా చంద్రబాబు చిత్తూరు పర్యటనలో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు నాని ఇంట్లో జరిగిన ప్రెస్మీట్ లో.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా పనిచేసిన దళిత మాజీమంత్రి పరస రత్నం పరిస్థితి ఏ విధంగా ఉందో ఫొటోలో ఒకసారి చూడండి… అతని సీనియారిటీకైనా కనీస మర్యాద ఇవ్వకుండా ఆ ప్రెస్ మీ ట్లో చంద్రబబు ఎలా నిల బెట్టారో అర్థం అవుతుంది. 

దీనిని బట్టే అర్థం అవుతుంది… తెలుగుదేశం పార్టీలో దళితులకు ఏమాత్రం గౌరవం ఉందనేది. ఓ మాజీ మంత్రికి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వకపోవడంతో దళిత సంఘాలు చంద్రబాబుపై మండి పడుతున్నాయి. 

CBN:

CBN

Tags:   CBN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ