లక్కీగా ఎస్కేప్ అయిన పూజా హెగ్డే

Pooja Hegde was the lucky escape

పూజా హెగ్డే లక్కీగా ఎస్కేప్ అయ్యిందో.. లేదంటే ఆమె అదృష్టం బాగుండి.. ఆమెని గుంటూరు కారం మేకర్స్ తప్పించారో తెలియదు కానీ.. పూజ హెగ్డే పై రావాల్సిన ట్రోల్స్ ఇప్పుడు శ్రీలీల పై వస్తున్నాయి. మహేష్-త్రివిక్రమ్ గుంటురు కారం కాంబో మొదలైనప్పుడు పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకున్నారు. తర్వాత శ్రీలీలని సెకండ్ హీరోయిన్ గా తీసుకోగా.. పూజ హెగ్డే మెయిన్ హీరోయిన్ గా ఉంది

ఆ తర్వాత పూజా హెగ్డే గుంటూరు కారం నుంచి తప్పుకుంది(తప్పించారో) పూజ హెగ్డే ఉండాల్సిన ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది. శ్రీలీల ప్లేస్ లోకి మీనాక్షి చౌదరి చేరింది. గుంటూరు కారం ఛాన్స్ మిస్ అయినందుకు పూజా హెగ్డే ని అన్ లక్కీ అనుకున్నారు. కానీ సినిమా విడుదలయ్యాక శ్రీలీల కేరెక్టర్ చూసాక పూజా హెగ్డే లక్కీగాసేఫ్ అయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీల కేరెక్టర్ పై మీమ్స్ , యూత్ అయితే శ్రీలీలని చూడలేకపోయామంటున్నారు.

మరి ఈ మీమ్స్, ఈ కామెంట్స్ అన్ని పూజా హెగ్డే భరించాల్సి వచ్చేది. నిజంగా పూజా హెగ్డే గుంటురు కారం లో నటించకపోవడమే ఆమెకి చాలా హెల్ప్ అయ్యింది అంటున్నారు ఆమె అభిమానులు.

Guntur Kaaram Result disappointing for Sreeleela fans

guntur kaaram