సూర్య ని ఢీ కొట్టనున్న గోపీచంద్?
Gopichand as villain in Suriya's next?
నటుడు గోపీచంద్ టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు హీరోగానే ఎంటర్ అయ్యారు. ఆతర్వాత వర్షం, జయం చిత్రాల్లో విలన్ గా గోపీచంద్ నటన వేరే లెవల్. ఇప్పటికి ఆయన్ని హీరోగా కన్నా విలన్ గానే ఆరాధించే ప్రేక్షకులు ఉన్నారు. ఆతర్వాత ఆయన విలనిజాన్ని వదిలేసి హీరోగానే తన కెరీర్ ని కొనసాగిస్తున్నారు.
అయితే హీరోగా ఈమధ్యన గోపీచంద్ కాస్త డౌన్ అయ్యారు. ఇలాంటి సమయంలో ఆయన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో నెగెటివ్ కేరెక్టర్ చేయబోతున్నాడనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్, సీన్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను సాధించిన సూర్య తదుపరి మూవీ జ్ఞానవేల్ రాజాతో చేస్తున్నారు.
తర్వాత సూర్య , డీసీ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో నటించబోయే చిత్రంలోనే సూర్య ని ఢీ కొట్టే పాత్రలో గోపీచంద్ కనిపించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఈ కాంబో మాత్రం అదిరిపోతోంది అని చెప్పాల్సిందే. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ రెండు లాంగ్వేజెస్ లోను ఈ చిత్రం క్రేజీ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.
















































