నాగ చైతన్య తో ఒక తార
Naga Chaitanya to romance Satvika Veeravalli
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య వృషకర్మ ప్రమోషన్స్ ను పీక్స్ లో మొదలుపెట్టారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి తో కలిసి నాగ చైతన్య వృషకర్మ ప్రమోషన్స్ ని ఇంట్రెస్టింగ్ గా నడిపిస్తున్నారు. దర్శకుడు కార్తీక్ దండు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నారు. డిసెంబర్ 4 న విడుదలవుతున్న సినిమాల్లో వృషాకర్మ ప్రమోషన్స్ హైలెట్ అవుతున్నాయి.
నాగ చైతన్య వృషకర్మ తర్వాత చెయ్యబోయే మూవీలో హీరోయిన్ ఫైనల్ అయ్యింది. ఆమె ఆకాశంలో ఒక తార హీరోయిన్ సాత్విక వీరవల్లి. దుల్కర్ సల్మాన్ తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ అవుతున్న సాత్విక వీరవల్లి ఆ చిత్రం విడుదలకు ముందే నాగ చైతన్య తో రొమాన్స్ కి రెడీ అయ్యింది.
మహేష్ బెదురులంక దర్శకత్వంలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో నాగ చైతన్య చెయ్యబోయే మూవీలో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది. మరి ఈ అమ్మాయి లక్కు మాములుగా లేదు. ఇప్పుడు రామ్ చరణ్-సుకుమార్ కలయికలో మొదలైన RC17 లోను ఈ హీరోయిన్ పేరు వినిపిస్తుంది అదే ఫైనల్ అయితే సాత్విక వీరవల్లి మాములుగా హైలెట్ అవ్వదు.
















































