వారణాసి పై వార్తలు ఆపండి రాజమౌళీ..!
Industry Believes Varanasi May Be Postponed
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా ఫిలిం వారణాసి చిత్రం.. ఏప్రిల్ 7 విడుదల అని రాజమౌళి ఎప్పుడో ప్రకటించారు. వారణాసి వేదికగా రిలీజ్ డేట్ బోర్డింగ్స్ తో సర్ ప్రైజ్ చేసారు. అయితే ఇప్పుడు ఈ డేట్ మారుతుంది అంటూ ఎన్నో ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఒకరు జూన్ అంటారు, మరొకరు వారణాసి జులై విడుదల అంటారు. మరికొందరు మహేష్ బర్త్ డే మంత్ ఆగష్టు లో వారణాసి విడుదల అంటూ మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో వారణాసి విడుదల తేదీపై జరుగుతున్న రచ్చ విషయంలో వారణాసి అండ్ టీం కానీ రాజమౌళి కానీ క్లారిటీ ఇవ్వడం లేదు.
షూటింగ్ పూర్తయ్యింది. సీజీ వర్క్, పోస్ట్ ప్రోడక్షన్ అన్నివేగవంతగా జరుగుతున్నాయి. ఒకవేళ ఏప్రిల్ 7 నే వారణాసి విడుదల ఉంటుందా, అదే ఏ విషయము రాజమౌళి చెబితే బావుంటుంది. ఏది ఏమైనా వారణాసి రిలీజ్ డేట్ పై వస్తున్న వార్తలను ఆపమంటూ మహేష్ ఫ్యాన్స్ రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తున్నారు.
















































