పోస్ట్ ప్రెగ్నెన్సీ డిప్రెషన్ లో రామ్ చరణ్ భార్య
Upasana experiencing post-pregnancy depression
చాలామంది మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలోను, అలాగే పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ప్రసవానంతరం డిప్రెషన్ కు లోనై చాలా సమస్యలు ఎదుర్కుంటారు. ఆ సమయంలో డాక్టర్ ని కలిసి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటుగా, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటె ఆ మహిళలు ఆ డిప్రెషన్ నుంచి బయటపడతారు.
తాజాగా ప్రముఖ హీరో రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పిటల్స్ డైరెక్టరు ఉపాసన తన రెండో ప్రెగ్నెన్సీ అలాగే పోస్ట్ ప్రెగ్నెన్సీ డిప్రెషన్ పై ఎమోషనల్ గా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె ఓ ఈవెంట్ లో మట్లాడుతూ.. నా రెండో ప్రెగ్నెన్సీ చాలా చాలా ప్రత్యేకమైనది. దాని గురించి ఇప్పుడు మాట్లాడటానికి నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ నవ్వుతున్న ముఖం వెనుక, ఇంకా గాయం నుండి కోలుకుంటున్న ఒక తల్లి ఉంది అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
ప్రెగ్నెన్సీ టెస్ట్, నెలసరి తప్పడం, అది ఒక వేడుక. కానీ ఆ సమయంలో మీకు పీరియడ్ వస్తే, మీ గుండె ఒక క్షణం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ప్రెగ్నెంట్ అనేది కేవలం మూడు 9 నెలలు మాత్రమే కాదని, దానికి ముందు ప్రీ-ట్రైమెస్టర్ కూడా ఉంటుందని ఉపాసన చెప్పారు.
మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో డాక్టర్ సుమన తన పట్ల చూపిన శ్రద్ధను ఉపాసన గుర్తుచేసుకున్నారు. అయితే కవలలతో తన రెండో ప్రెగ్నెన్సీ తర్వాత ప్రసవానంతర పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ తనను మానసికంగా దెబ్బతీసిందని, ఒక తల్లిగా నేను ఇంకా కోలుకుంటున్నాను.. అని ఉపాసన ఎమోషనల్ అయ్యారు.
ఈ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన తన డాక్టర్లకు, తన మొత్తం బృందానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రతి తల్లికి నాలుగో త్రైమాసికం చాలా ఇంపార్టెంట్ అని.. ఆ సమయంలో తల్లులను జాగ్రత్తగా చూసుకోవాలని, వారికి అవసరమైన మానసిక, శారీరక మద్దతును కుటుంబం అందించాలని ఉపాసన చెప్పుకొచ్చారు.
















































