తరుణ్-ఈషా బంధంపై తరుణ్ భాస్కర్ తల్లి కామెంట్స్
Geetha Bhascker Emotional Comments On Eesha Rebba
దర్శకుడు తరుణ్ భాస్కర్-హీరోయిన్ ఈషా రెబ్బ డేటింగ్ లో ఉన్నారనే వార్తలకు బలం చేకూరుస్తూ వీరిద్దరూ కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించడం, విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్ళికి వెళ్లడం ఇవన్నీ వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలకు ఆజ్యం పోశాయి. ఈమధ్యన అయితే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అన్నారు.
తాజాగా తరుణ్ భాస్కర్ తల్లి వీరిపై వస్తున్న వార్తలను నిజం చేసేలా కామెంట్స్ చేసారు. ఈనగరానికి ఏమైంది సీక్వెల్ ENE రిపీట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తరుణ్ భాస్కర్ తల్లి మాట్లాడుతూ.. తరుణ్ భాస్కర్ గత రెండేళ్లుగా కోర్టు కేసులతో అలాగే ఇల్లు కట్టడం వంటి విషయంలో చాలా సఫర్ అవుతూ.. అప్స్ అండ్ డౌన్స్ చూసాడు
నైట్ రెండింటికి, నాలుగింటికి ఇంటికొచ్చినప్పుడు తిన్నాడో.. లేదో అని చూస్తూ ఓ సోల్మెట్ లా, ఒక పార్ట్నర్ లాగా, ఓ ఫ్రెండ్ లాగా ఉంది తరుణ్ ని చూసుకుంది ఈషా రెబ్బ. ఆమె సపోర్ట్, ఆమె ఫ్యామిలీ, నాకు ఒక ధైర్యం, నాకు వయసవుతుంది. ఫ్రెండ్స్ కి కూడా కొన్ని చెప్పుకోలేము, ఆమె వండర్ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. థాంక్స్ ఈషా. ఆమె ఈ ఈవెంట్ కి రాలేదు అంటూ ఈషా కి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు ఆమె.
మరి ఈలెక్కన తరుణ్ భాస్కర్ తల్లి వారిద్దరి బంధంపై మీడియా ముఖంగా పుకార్లకు చెక్ పెట్టినట్లే. వారు త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే విషయాన్ని ఆమె ఇండైరెక్ట్ గా కన్ ఫర్మ్ చేసారంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
















































