ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Director powerful title for Chiranjeevi-Nagarjuna multi starrer

ఇద్దరు ఇద్దరే.. టైటిల్ ఏదో బావుంది!

Director powerful title for Chiranjeevi-Nagarjuna multi starrerDirector powerful title for Chiranjeevi-Nagarjuna multi starrer


భీష్మ చిత్రం తర్వాత వెంకీ కుడుముల తో మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్రకటన వచ్చింది. ఆతర్వాత వెంకీ కుడుముల తో చిరు సినిమా లేకుండా పోయింది. నితిన్ తో రాబిన్ హుడ్ తీసి వెంకీ కుడుములు దర్శకుడిగా సైలెంట్ అయ్యి ఇట్లు అర్జున తో ప్రొడ్యూసర్ గా మారాడు. తాజాగా ఇట్లు అర్జున సక్సెస్ మీట్ కి గెస్ట్ గా వచ్చిన చిరు వెంకీ కుడుములు ను ఉద్దేశించి..

నేను ఏ దర్శకుడిని నాతో సినిమా చెయ్యి అని అడగలేదు, ఈ దుర్మార్గుడు వెంకీ కుడుములని అడిగాను, నా దగ్గరకి రాకు.. వచ్చే అర్హత నీకు లేదు, నా ఇంటి తలుపులు మూసేశాను నీకు మంచి కథతో వస్తానని చెప్పి వెళ్ళిపోయి.. ఇప్పుడు నిర్మాత అయ్యావు అంటూ ఫన్నీగా మాట్లాడారు.

ఇక వెంకీ కుడుముల చిరు ని పొగురుడుతూ.. చిరు సార్... మీరు ఛలో సినిమాకి వచ్చి బ్లెస్ చేశారు, భీష్మ సినిమా మీతో కలిసి చూసే అదృష్టం లభించింది, ఇప్పుడు ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చారు అన్నారు.

అయితే వెంకీని ఈ ఈవెంట్ లో ఒక పక్క చిరంజీవి గారు.. మ‌రో పక్క నాగార్జున గారు ఉన్నారు వీళ్ళ ఇద్దరిని పెట్టి డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఆ సినిమా టైటిల్ ఏమై ఉంటుంది అని అడిగితె.. ఇద్దరు ఇద్దరే అని వెంకీ కుడుములు చెప్పిన క్రేజీ ఆన్సర్ చూసి అటు మెగా అభిమానులు, ఇటు అక్కినేని అభిమానులు ఈ టైటిల్ ఏదో బావుందే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Chiranjeevi-Nagarjuna multi starrer