ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pawan Kalyan Fans Rejoice: OG 3 In The Works

ఓజీ 2 కంటే ముందే ఓజీ 3!

Pawan Kalyan Fans Rejoice: OG 3 In The WorksPawan Kalyan Fans Rejoice: OG 3 In The Works

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన `ఓజీ`  సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్  తమన్ ఇచ్చిన తాజా అప్‌డేట్  సోషల్ మీడియాలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో సంచలనాలు సృష్టించిందో  చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ యాక్షన్‌తో సినిమా అంద‌ర్నీ  ఆకట్టుకుంది.

తాజాగా ఓ  టెలివిజన్ షోలో పాల్గొన్న తమన్.. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న `ఓజీ` ఫ్రాంచైజీ  రెండు పార్ట్‌లతోనే ఆగిపోదని.. భవిష్యత్తులో ఏకంగా `ఓజీ 3` కూడా రానుందని  వెల్లడించారు. ఈ మాస్ యాక్షన్ సీరిస్‌కు సీక్వెల్‌తో పాటు ప్రీకెల్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పడంతో పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవ‌దులు లేవు.

ప్రస్తుతం `ఓజీ 2` షూటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతుండగా దానికి మించి మూడో భాగం కూడా ఉంటుందనే వార్త ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫ్రాంచైజీలో మొదటి చిత్రంలోని ప్రధాన పాత్రలన్నీ కొనసాగుతాయని.. దర్శకుడు సుజీత్ సిరీస్‌ను మరింత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
 

Pawan Kalyan OG 3