ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Allu Arjun Raaka Shooting Update Atlee Shifts to Hyderabad

హైదరాబాద్ కి రాకా

Allu Arjun Raaka Shooting Update Atlee Shifts to HyderabadAllu Arjun Raaka Shooting Update Atlee Shifts to Hyderabad

 

ఇప్పటివరకు ముంబై లోనే షూటింగ్ జరుపుకుంటున్న అల్లు అర్జున్ పాన్ ఇండియా ఫిలిం రాకా షూటింగ్ ఇపుడు హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వబోతుంది. ముంబై పరిసర ప్రాంతాల్లోనే దర్శకుడు అట్లీ రాకా షూటింగ్ చేస్తున్నారు. ఓ భారీ షెడ్యూల్ దుబాయ్ లో ప్లాన్ చేసారు. కానీ అక్కడి యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దుబాయ్ రాకా షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది.

దాంతో అట్లీ ఇంకా అల్లు అర్జున్ ఆ దుబాయ్ లో చెయ్యాల్సిన రాకా షూటింగ్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటి లో భారీ సెట్ నిర్మించి చెయ్యాలని ఫిక్స్ అవడమే కాదు అల్లు అర్జున్ ముంబై నుంచి హైదరాబాద్ కూడా వచ్చేసారు. రామోజీ ఫిలిం సిటీలోనే సెట్ నిర్మించి అక్కడే రాకా దుబాయ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేస్తారని తెలుస్తుంది.

ఈ చిత్రంలో దీపికా పదుకునే మెయిన్ లీడ్ లో నటిస్తుంటే రష్మిక, జాన్వీ, మృణాల్ ఠాకూర్ లు గెస్ట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇక రాకా షూటింగ్ అప్ డేట్ అలాగే రాకా రిలీజ్ డేట్ కోసం అల్లు అభిమానులు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు 

Raaka Hyderabad Schedule Update