రామాయణ: పార్ట్ 1 - ప్రీ-రిలీజ్ రికార్డులు

Ramayana Part 1 - Pre-release RecordsRamayana Part 1 - Pre-release Records

నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా (ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ - మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మైథాలాజికల్ దృశ్యకావ్యం `రామాయణ: పార్ట్ 1` నవంబర్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా  విడుదలకు సిద్ధమవుతోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే న భూతో న భవిష్యతి అనే రీతిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ విడుదలకు ముందే బడ్జెట్, వ్యాపార పరిమాణంతో సంచలనం సృష్టిస్తోంది. ఈ రెండు భాగాల ఎపిక్ కోసం నిర్మాతలు ఏకంగా 4,000 కోట్లు వెచ్చిస్తుండగా  పార్ట్-1 నిర్మాణ వ్యయమే 1,000 కోట్ల నుండి 1,100 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

సినిమా విడుదలకు ముందే బిజినెస్ వర్గాల్లో అపూర్వమైన డిమాండ్‌ను సొంతం చేసుకుని రికార్డు స్థాయి ప్రీ-రిలీజ్ గణాంకాలను సాధించింది. థియేట్రికల్ పంపిణీ, డిజిటల్ స్ట్రీమింగ్  మ్యూజిక్ హక్కులతో కలిపి `రామాయణ: పార్ట్ 1` థియేటర్లలోకి రాకముందే ఏకంగా 1130 కోట్ల మేర భారీ రికార్డు బిజినెస్‌ను నమోదు చేసింది. అందులోనూ  హిందీ థియేట్రికల్ హక్కులే  250 కోట్లకు అమ్ముడుపోవడం  ప్రాజెక్ట్ పట్ల  అంచనాలకు అద్దం పడుతోంది.

అడ్వాన్స్ బుకింగ్స్ .. బాక్సాఫీస్ అంచనాల విషయానికి వస్తే ఈ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. భారతదేశ వ్యాప్తంగా 60,000 పైగా షోలకు గాను ఇప్పటికే 18.67 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై  73.40 కోట్ల నుండి రూ. 75.56 కోట్ల అడ్వాన్స్ గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. విదేశాల్లోనూ ముఖ్యంగా ఉత్తర అమెరికాలో లభిస్తున్న రెస్పాన్స్‌తో గ్లోబల్ ప్రీ-సేల్స్ 75 కోట్ల నుండి  115 కోట్లకు చేరాయి. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం తొలిరోజే భారతదేశంలో అన్ని భాషల్లో కలిపి 50 కోట్ల నుండి 83 కోట్ల నెట్ (మొత్తం ఇండియా నెట్ 110 కోట్లకు పైగా) సాధించే అవకాశం ఉండగా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 200 కోట్లకు పైగా  గ్రాస్ వసూళ్లను రాబట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Ramayana Part 1