ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Amitabh Bachchan Goes Behind Bulletproof Glass In Fan Greeting Outside

అభిమానుల కలయికకు బుల్లెట్ ప్రూఫ్ బ్రేకులు!

Amitabh Bachchan Goes Behind Bulletproof Glass In Fan Greeting OutsideAmitabh Bachchan Goes Behind Bulletproof Glass In Fan Greeting Outside

 

బాలీవుడ్‌ను  వరుస షూటౌట్‌లు, హత్య బెదిరింపులు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత కొంతకాలంగా ప్రముఖ నటులను లక్ష్యంగా చేసుకుని వస్తున్న బెదిరింపులు, ముంబైలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలు ఇండస్ట్రీలో అలజడి సృష్టించాయి. ముఖ్యంగా గ్యాంగ్‌స్టర్ ముఠాల నుంచి వస్తున్న హెచ్చరికలతో అగ్ర కథానాయకులు రక్షణపై తీవ్ర నిఘా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు  అభిమానులను కలిసేందుకు ఎంతో ఉత్సాహం చూపించిన తారలు ఇప్పుడు ప్రతి అడుగు ఆలోచించి వేయాల్సి వస్తోంది. ఈ పరిణామాలతో బాలీవుడ్ వ్యాప్తంగా ఒకరకమైన అభద్రతాభావం అలముకుంది.

ఈ భయానక పరిస్థితుల నేపథ్యంలో బాలీవుడ్ స్టార్స్  అభిమానుల కలయికలపై కఠినమైన నిబంధనలు విధిస్తున్నారు. పుట్టినరోజులు, సినిమా ప్రమోషన్లు, బహిరంగ వేడుకల్లో నేరుగా జనంలోకి రాకుండా బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అత్యున్నత స్థాయి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, కమాండో తరహా బందోబస్తు మధ్యనే వారు ప్రయాణిస్తున్నారు. చివరకు ఫ్యాన్స్ మీట్‌లు, పబ్లిక్ ఈవెంట్లను కూడా పరిమితం చేయడం లేదా పూర్తిగా రద్దు చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అభిమానుల ప్రేమను ఆస్వాదించాలన్నా? కూడా సెక్యూరిటీ అనుమతులు తప్పనిసరి అయ్యాయి.

స్టార్లు .. అభిమానుల మధ్య ఉండే అనుబంధంపై  బెదిరింపుల సంస్కృతి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఎల్లప్పుడూ తమ అభిమాన నటులను దగ్గరగా చూడాలని, వారితో ఫొటోలు దిగాలని తపించే ఫ్యాన్స్‌కు  కట్టుదిట్టమైన భద్రతా వలయాలు నిరాశను కలిగిస్తున్నాయి. అయితే ప్రాణరక్షణే ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్న తారలు, రిస్క్ తీసుకోలేక డిజిటల్ మాధ్యమాలు ద్వారానే ఫ్యాన్స్‌తో ముచ్చటించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ భద్రతా సంక్షోభం బాలీవుడ్ రంగుల ప్రపంచంలో  కొత్త ప్రతిబంధకంగా మారిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Amitabh Bachchan Greets Fans Behind Bulletproof Glass