ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu 10 : Mukhesh and Varshini vs Sudheer

BB10: ముఖేష్ ని నాశనం చేస్తుంది వర్షిణినే: సుధీర్

Bigg Boss Telugu 10 : Mukhesh and Varshini vs SudheerBigg Boss Telugu 10 : Mukhesh and Varshini vs Sudheer

 

బిగ్ బాస్ సీజన్ 10 లో ముందు నుంచి మంచి ఫ్రెండ్స్ గా ఉన్న ముఖేష్ గౌడ, సుధీర్, వర్షిణ ల మద్యన ఈ వారం విభేదాలు మొదలయ్యాయి. సుధీర్, ముఖేష్, వర్షిణి ఈముగ్గురితో ఝాన్సీ కలిసి ఉండేది. ఆతరవాత రోహిత్ ఈ బ్యాచ్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ముఖేష్ vs త్రిగుణ అన్న రేంజ్ లో గోడవలు జరుగుతున్నాయి.

గత శుక్రవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో సుధీర్ ఆడియన్స్ ఓటింగ్ తో వెళ్లిపోవాల్సిన వాడిని ముఖేష్ తనదగ్గర ఉన్న పవర్ తో ఝాన్సీ ని కన్విన్స్ చేసి సుధీర్ ని మ్యాజికల్ కీ పవర్ తో కాపాడాడు. దానితో సుధీర్ ముఖేష్ కి బాగా దగ్గరయ్యాడు. అయితే సుధీర్, ముఖేష్, రోహిత్, వర్షిణి కలిసి త్రిగుణ పై చేసిన వల్గర్ కామెంట్స్ విషయంలో సుధీర్ తన తప్పు లేదు అని తెలుసుకుని ముఖేష్ కి వర్షిణి కి దూరంగా ఉంటున్నాడు.

నామినేషన్స్ రోజు మాత్రమే కాదు, నరేష్, రామ్ ప్రసాద్ లతో తాను ఇండివిడ్యువల్ గా టాస్క్ ఆడి నిరూపించుకుని వాళ్లకు దూరంగా ఉంటానని చెబుతున్నాడు. ముఖేష్ కి కూడా కోపం తగ్గించుకోమని చెప్పాను, కానీ వర్షిణి ముఖేష్ ని రెచ్చగొట్టింది అని నరేష్ దగ్గర చెప్పాడు.

ముఖేష్ వచ్చి సుధీర్ తో మాట్లాడుతూ.. ఎందుకు అలా ఉన్నావ్, ఇండివిడ్యువల్ గా ఆడతా అంటున్నావ్ అని అడిగాడు. అక్కడే వర్షిణి కూడా ఉంది. నువ్వు ఈరోజు చేసింది నాకు నచ్చలేదు, నేనేం మాట్లాడను, నాకు నచ్చలేదు ముఖేష్ అన్నా, ఈరోజు నామినేషన్స్ లో నిన్ను వర్షిణినే ప్రోవోక్ చేసింది అంటూ ఓపెన్ గా సుధీర్ ముఖేష్, వర్షిణి లతో తెగతెంపులు చేసేసుకున్నాడు.

Bigg Boss: Mukhesh Gowda and Varshini vs Sudheer