ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Radhika Apte Criticises Her Role In Legend Calls It A Difficult Experience

బాలీవుడ్ హీరోయిన్స్ విషయంలో జర జాగ్రత్త

Radhika Apte Criticises Her Role In Legend Calls It A Difficult ExperienceRadhika Apte Criticises Her Role In Legend Calls It A Difficult Experience

 

పాన్ ఇండియా అప్పీరియన్స్, అలాగే సినిమాలపై క్రేజ్ పెంచేందుకు టాలీవుడ్ దర్శకులు ఇక్కడి స్టార్ హీరోల కోసం బాలీవుడ్ భామలను ఏరి కోరి తీసుకురావడం అనేది ఎప్పటినుంచో నడుస్తున్న ట్రెండ్. భారీ పారితోషికానికి సౌత్ సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్స్ సిద్దమే.

అయితే అన్నిటికి ఒప్పుకుని నార్త్ కన్నా కాస్త తక్కువగానే ఎక్స్పోజింగ్ చేసేందుకు రెడీ అయ్యే బాలీవుడ్ భామలు.. బాలీవుడ్ ఇంటర్వూస్ లో, అక్కడి పాపులర్ షోస్ లో టాలీవుడ్ సినిమాలను, దర్శకులను తాము చేసిన పాత్రలను వేలెత్తి చూపుతూ చేస్తున్న కామెంట్స్ పై తెలుగు ప్రేక్షకులు భగ్గుమంటున్నారు. అంతెందుకులే సౌత్ లో హీరోయిన్స్ గా ఎదిగి.. కెరీర్ ని చక్కదిద్దుకున్న హీరోయిన్స్ కే నోరు అదుపు లేదు.

సౌత్ లో అవకాశాలు తగ్గగానే నార్త్ కి వెళ్లి సౌత్ దర్శకులను విమర్శిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అక్కడ హీరోయిన్స్ సౌత్ లో నటించి ఇక్కడి వాళ్ళను విమర్శిస్తున్నారు, తాము చేసే పాత్ర గురించి తెలుసు, గ్లామర్ ఆరబోసే విషయము తెలుసు, కానీ సినిమాలు విడుదలైన కొన్నేళ్ళకు పనిగట్టుకుని విమర్శిస్తే దానర్ధం ఏమిటి.

ఈమధ్యన జాన్వీ కపూర్ పెద్దిపై కాఫీ విత్ కరణ్ షో లో చేసిన కామెంట్స్ పై తెలుగు ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టపడే కదా సినిమా చేసావ్ అంటూ తిట్టిపోశారు. ఇప్పుడు రాధికా ఆప్టే.. బాలయ్య లెజెండ్ పై ఇండైరెక్ట్ గా చేసిన కామెంట్స్ పై ఇక్కడి ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు.

Radhika Apte Once Again Comments About Her Tollywood Experience