ముంబై ఎయిర్‌పోర్ట్‌లో `మిస్టరీ ఉమెన్` తో ధనుష్
Dhanush spotted with mystery women at Mumbai airportకోలీవుడ్ స్టార్ ధనుష్‌కు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ కావడంతో మరోసారి రూమర్స్ తెరపైకి వచ్చాయి. ముంబై విమానాశ్రయంలో ధనుష్ ఇద్దరు మహిళలతో కలిసి కనిపించగా ఈ దృశ్యాలు నెట్టింట చర్చకు దారితీశాయి. వాస్తవాలు తెలుసుకోకుండానే కొందరు వ్యూస్ కోసం వక్రీకరించి తప్పుడు ప్రచారాలు చేయడం ప్రారంభించారు. దీంతో ఈ వీడియో వెనుక అసలు నిజం ఏంటనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
వీడియోలో ధనుష్‌తో పాటు కనిపిస్తున్న ఇద్దరు మహిళలు ఎవరో తేలింది. వారిలో ఒకరు కావ్య శ్రీరామ్ కాగా, మరొకరు ధనుష్‌కు చెందిన వుండర్‌బార్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థలో ఆపరేషన్స్ హెడ్‌గా పనిచేస్తున్న అవంతిక కనగరాజ్. ప్రొఫెషనల్ పనుల నిమిత్తం ధనుష్ తో పాటు ప్రయాణిస్తున్న వారిపై కూడా కొందరు పనిగట్టుకుని తప్పుడు కథనాలు సృష్టించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యక్తిగత విషయాలపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ధనుష్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `OM`పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా వంటి ప్రముఖ తారాగణం నటిస్తోంది. పలుమార్లు విడుదల తేదీల్లో మార్పుల తర్వాత సినిమా నవంబర్ 20న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
















































