ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Jhansi has been eliminated

BB10: సుధీర్ ని సేవ్ చేసి ఆమె ఎలిమినేట్ అయ్యింది!

Bigg Boss 10:  Jhansi has been eliminatedBigg Boss 10: Jhansi has been eliminated


బిగ్ బాస్ సీజన్ 10 లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పారు. గత రాత్రి రెడ్ లో ఉన్న ఝాన్సీ, రోహిత్, శ్వేతా, రామకృష్ణ, సుధీర్ లలో ఎవరో ఒకరిని బయటకి పంపించెయ్యమని బిగ్ బాస్ గ్రీన్ లెవల్ గొట్స్ కు చెప్పారు. దానిలో భాగంగా రోహిత్ కి, రామకృష్ణకు మూడు మూడు ఓట్స్ పడ్డాయి. సుధీర్ కి ఒక్క ఓటే పడింది.

అయితే బిగ్ బాస్ ఒక ఓటు వచ్చినా ఆడియన్స్ ఓట్స్ తక్కువగా ఉన్నాయ్ అని సుధీర్ ని ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి వెళ్ళమని డోర్స్ ఓపెన్ చేసాడు. దానితో ముఖేష్ హడావిడిగా తన దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ ని జాన్సీ చేత వాడించాడు. దానితో సుధీర్ సేవ్ అయ్యాడు. ఈరోజు ఎపిసోడ్ లో ఝాన్సీని నాగ్ అడిగారు. ముఖేష్ చెప్పాడని ఎవిక్షన్ ప్రీ పాస్ వాడావా, లేదంటే మనస్ఫూర్తిగా వాడవా అని.. మనస్ఫూర్తిగా వాడాను అంది.

ఈ వారం ఆడియన్స్ ఓట్స్ తో ఝాన్సీ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. అగ్నిపరీక్ష ద్వారా హౌస్ లోకి వచ్చి ఆటలో మేటి అనిపించుకుంది కానీ.. ముఖేష్, రామ్ ప్రసాద్ లతో తిరుగుతూ ఒక గ్రూప్ లోనే ఉండిపోయింది. అలాగే ఆమె రైతు బిడ్డ ట్యాగ్ ని ఉపయోగించి సింపతీ కార్డు ప్లే చేస్తుంది అనే భావనలో ఆడియన్స్ ఉన్నారు.

దానితో ఈ రోజు ఝాన్సీని ఆడియన్స్ తమ ఓట్స్ తో ఎలిమినేట్ చేసారు. పాపం ఝాన్సీ.. తన దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ ని సుధీర్ కోసం వాడి ఆమె మాత్రం ఎలిమినేట్ అయ్యి బలైపోయింది. 

Singer Jhansi has been eliminated from the Bigg Boss 10