`కింగ్` తో షారుక్ ఖాన్ సరికొత్త రికార్డు!

Shah Rukh Khan's King set a record Shah Rukh Khan's King set a record

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద అసమానమైన క్రేజ్‌ను మరోసారి నిరూపించుకున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్  ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా `కింగ్` మూవీ ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు ఏకంగా 175 కోట్లకు అమ్ముడయ్యాయి. ఫార్స్ ఫిల్మ్స్  సంస్థ ఈ హక్కులను మినిమమ్ గ్యారెంటీ ప్రాతిపదికన దక్కించుకోవడం ద్వారా భారతీయ సినిమా చరిత్రలోనే ఓవర్సీస్ హక్కుల పరంగా సరికొత్త రికార్డు నమోదైంది. అంతర్జాతీయంగా షారుక్‌కున్న విపరీతమైన పాపులారిటీకి ఈ భారీ డీల్ నిదర్శనంగా నిలిచింది.

ఈ భారీ మొత్తానికి ఓవర్సీస్ హక్కులు దక్కించుకోవడంతో డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావాలంటే `కింగ్` చిత్రం అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద కనీసం $37-40 మిలియన్లు (సుమారు ₹350 నుండి ₹375 కోట్లు) గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. గతంలో షారుక్ ఖాన్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్స్ `పఠాన్`, `జవాన్` చిత్రాలు విదేశాల్లో 400 కోట్ల వరకు వసూలు చేశాయి.  ఈ నేప‌థ్యంలో ఈ కొత్త చిత్రం కూడా లాభాల బాట పట్టాలంటే ఆల్-టైమ్ రికార్డు స్థాయి వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. `ఆర్‌ఆర్‌ఆర్`, `ధురంధర్ 2` వంటి బిగ్గెస్ట్ ఓవర్సీస్ హిట్స్ సరసన నిలవాల్సిన అవసరం ఏర్పడింది.

ఈ భారీ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ, జైదీప్ ఆహ్లావత్, రాఘవ్ జుయల్ వంటి దిగ్గజ తారలు నటిస్తున్నారు. వీటితో పాటు షారుక్ ఖాన్  కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి తొలిసారిగా  న‌టించ‌డంఈ చిత్రంపై మరింత ఉత్కంఠను పెంచుతోంది. ఈ  మూవీని డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

SRK King