ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Raveena Tandon is feeling nostalgic as her 1994 film Mohra

రామాయణం రేసులో 90ల నాటి బ్లాక్‌బస్టర్

Raveena Tandon is feeling nostalgic as her 1994 film MohraRaveena Tandon is feeling nostalgic as her 1994 film Mohra

బాలీవుడ్‌లో ఒకానొక సమయంలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కల్ట్ యాక్షన్ థ్రిల్లర్ `మోహ్రా` సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం పట్ల నటి రవీనా టండన్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా విడుదలై దశాబ్దాలు గడుస్తున్నా? అందులో పాటలు, సన్నివేశాలు నేటికీ ప్రేక్షకులను అలరిస్తుండడం పట్ల  ఆనందం వ్యక్తం చేశారు. రాణ్‌బీర్ కపూర్ నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం `రామాయణం`తో పాటు ఈ క్లాసిక్ సినిమా కూడా రీ-రిలీజ్ అవుతుండటంతో సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఈ సందర్భంగా రవీనా టండన్ పాత రోజులను గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అప్పట్లో తాము షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ చిత్రం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి క్రేజ్‌ను సొంతం చేసుకుంటుందని.. ఇందులో నటించిన పాటలు  ట్రెండ్‌గా మారుతాయని కలలో కూడా ఊహించలేదని  తెలిపారు. ముఖ్యంగా `తుమ్ చీజ్ బడి హై మస్ మస్` వంటి చార్ట్‌బస్టర్ సాంగ్ ఇండస్ట్రీలో ఐకానిక్ నంబర్‌గా నిలిచిపోతుందని ఆనాడు ఎవరూ భావించలేదని  గుర్తు చేసుకున్నారు.

ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న రీ-రిలీజ్ ట్రెండ్ ద్వారా పాత క్లాసిక్ సినిమాలను కొత్త తరానికి పరిచయం చేయడం అద్భుతమైన పరిణామమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, రవీనా టండన్ నటనతో పాటు వీజే షా సంగీతం అందించిన పాటలు  విజయానికి ఎంతగానో దోహదపడ్డాయి. ఏదేమైనా? ఆనాటి క్లాసిక్ బ్లాక్‌బస్టర్ మళ్లీ థియేటర్లలో సందడి చేస్తుండటంతో అభిమానులు పాత మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.

 

Raveena Tandon's iconic 1994 film Mohra is all set to re-release in cinemas