బాలీవుడ్ లో తీవ్ర విషాదం!

Filmmaker Sanjay Gupta passes awayFilmmaker Sanjay Gupta passes away

బాలీవుడ్‌లో తనదైన శైలి క్రైమ్ థ్రిల్లర్లు, స్టైలిష్ యాక్షన్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు, నిర్మాత సంజయ్ గుప్తా (57) కన్నుమూశారు. సంజ‌య్ ఆకస్మిక మరణం బాలీవుడ్ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మాస్ ఆడియన్స్‌ను కట్టిపడేసే కథాంశాలతో, ముంబై అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌తో ఎన్నో సంచలన చిత్రాలను తెరకెక్కించిన సంజ‌య్ మృతి పట్ల పలువురు  సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

నటుడు, క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్  ఎక్స్ వేదికగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. `సంజయ్ భాయ్.. మీరు మమ్మల్ని విడిచి వెళ్లారంటే నమ్మలేకపోతున్నాను. మనం తరచూ సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం. సినిమా ఇండస్ట్రీపై మీకున్న‌ పరిజ్ఞానం అనూహ్యం. మిమ్మల్ని ప్రతిరోజూ మిస్ అవుతాను బ్రో` అంటూ ఆవేదనను పంచుకున్నారు.

1994లో సంజయ్ దత్, ఆదిత్య పంచోలి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన `ఆతిష్: ఫీల్ ది ఫైర్` చిత్రంతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సంజయ్ గుప్తా.. తొలి సినిమాతోనే  ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన `కాంటే`, `ముసాఫిర్`, `షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా`, `షూటౌట్ ఎట్ వడాలా`, హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన `కాబిల్`, `ముంబై సాగా` వంటి చిత్రాలు సంజ‌య్ ను ప్రముఖ దర్శకుల జాబితాలో నిలబెట్టాయి. ముఖ్యంగా ఆయన చిత్రాల్లోని పవర్‌ఫుల్ డైలాగ్స్, స్టైలిష్ మేకింగ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
 

Shootout at Lokhandwala director Sanjay Gupta passes away