ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rakul Preet Singh's first look as Surpanakha

శూర్పణఖ ఇంత అందంగానా?

Rakul Preet Singh's first look as SurpanakhaRakul Preet Singh's first look as Surpanakha


రామాయణాన్ని కీలక మలుపు తిప్పిన పాత్ర శూర్పణకే. శూర్పణఖ రాముడిపై మనసు పారేసుకోవడం, రాముడి ఛాయలకు కూడా వెళ్లకుండా శూర్పణఖ ముక్కు కత్తిరించి పంపించడం, ఆమె ఏడుస్తూ వెళ్లి అన్న రావణుడికి రాముడి భార్య సీత అందాలను వర్ణించడంతోనే రావణుడు వచ్చి సీతను ఎత్తుకుపోయాడు, తర్వాత రాముడి చేతిలో వధించబడినాడు.

అయితే శూర్పణఖ పాత్ర కీలకమే అయినా.. రామాయణంలో అంతకుమించి చెప్పుకోవడానికి ఆమె గురించి ఏమి ఉండదు. కానీ శూర్పణఖను అందంగా చూపించవచ్చు అని బాలీవుడ్ డైరెక్టర్ రామాయణ తో చూపించారు. రణబీర్ రాముడిగా, సీతగా సాయి పల్లవి, రావణ్ గా యశ్ కలయికలో తెరకెక్కిన రామాయణ చిత్రంలో శూర్పణఖ పాత్రను అందమైన రకుల్ పోషించింది.

తాజాగా రామాయణ నుంచి రకుల్ ప్రీత్ శూర్పణఖ లుక్ వదిలారు. ఆమె లుక్ చూసిన వాళ్ళు రామాయణ లో శూర్పణఖ ఇంత అందంగా ఉంటుందా అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. తాను ఈ పాత్ర ఒప్పుకోవడానికి కారణముంది అంటూ రకుల్ శూర్పణఖ పాత్రపై అంచనాలు పెంచేలా ప్రమోషన్స్ లో మాట్లాడింది.

తాజాగా మేకర్స్ వదిలిన రకుల్ ప్రీత్ శూర్పణఖ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

Ramayana First Look: Rakul Preet Singh drops her look as Surpanakha