ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg boss 10 telugu Debjani and Shiv Vs Mukesh

BB10: శివ్, దేబ్జానీ వెంట పడుతున్నాడా?

Bigg boss 10 telugu Debjani and Shiv Vs MukeshBigg boss 10 telugu Debjani and Shiv Vs Mukesh

 


బిగ్ బాస్ సీజన్ 10 లో ఇప్పటికే ఓ ప్రేమ జంట విడిపోయింది. మొదటి నుంచి బాగా క్లోజ్ గా మూవ్ అవుతూ హగ్గులు, ముద్దులతో చిరాకు తెప్పించిన షాలిని, రోహిత్ లలో షాలిని ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది. దెబ్బకి రోహిత్ ఆట అందుకున్నాడు. హౌస్ లో మరో ప్రేమ జంట ముఖేష్ గౌడ, వర్షిణి.

ముఖేష్, వర్షిణి ఎక్కడ చూసినా జంట గానే కనిపిస్తారు. త్రిగుణ వర్షిణి ని నామినేట్ చెయ్యడంతో ముఖేష్ త్రిగుణ తో గొడవ పడుతున్నాడు. మరోపక్క వైల్డ్ ఫైర్ లో వచ్చిన శివ్ దేబ్జానీ తో లవ్ ట్రాక్ వేసుకున్నాడు, దేబ్జానీ వెంట శివ్ పడుతున్నాడు అంటూ ముఖేష్, వర్షిణి మట్లాడడం అది శివ్ వినడం, ఆ పంచాయితీ రాంప్రసాద్ దగ్గర పెట్టడమే కాదు శివ్ డైరెక్ట్ గా వెళ్లి ముఖేష్, వర్షిణీలను అడిగేసాడు.

ప్రస్తుతం BB హోటల్ టాస్క్ లో భాగంగా ఈ ముఖేష్ శివ్ ని అనడం శివ్ నాకు బయట అందమైన గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు ప్రియాంక గారు ఉన్నారు, మరో గర్ల్ ఫ్రెండ్ ఎందుకు అంటూ ముఖేష్ ని అడగగానే మేము అనుకున్నాం, మేము నలుగురం దేబ్జాని తో నువ్వు తిరుగుతున్నావ్ అని నలుగురు అంటూ ముఖేష్ రోహిత్ పేరు చెప్పగానే ఇప్పుడు పేర్లు ఎందుకు అంటూ వర్షిణి ఆపింది.

నేను వర్షిణి గారితో ఉన్నట్టే దేబ్జానీ గారితో ఉన్నాను అంటూ ఆ మేటర్ ను శివ్ దేబ్జానీ కి కూడా చెప్పాడు. మనకెందుకు అండి.. మీకు అలా అనిపించదు, నాకు అలా అనిపించదు అంటూ లైట్ తీసుకుంది. ముఖేష్ శివ్ ని అలా అనడంపై ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు, నువ్ చేసావని అందరూ చేస్తున్నారని నీ బాధ అంటూ ముఖేష్ ని తిట్టి పోస్తున్నారు.
 

Bigg Boss 10 Telugu