దాదా: బాలయ్య తో మనోజ్ ఫైట్

Dada: Balakrishna vs Manchu Manoj Dada: Balakrishna vs Manchu Manoj


గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న దాదా చిత్రం షూటింగ్ ప్రస్తుతం మైసూర్ లో జరుగుతుంది. ఈ భారీ షెడ్యూల్ మైసూర్ లో పూర్తి చేసుకుని హైదరాబాద్ లో మరో చిన్న షెడ్యూల్ తో దాదా షూటింగ్ పూర్తి అవుతుంది అని తెలుస్తుంది. డిసెంబర్ 24 టార్గెట్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ప్రస్తుతం మైసూర్ షెడ్యూల్ లో దాదా కి సంబందించిన క్లైమాక్స్ షూట్ జరుగుతుంది. ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా కనిపించబోతున్నారు, అంతేకాదు బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం మైసూర్ షెడ్యూల్ లో బాలయ్య-మనోజ్ పై యాక్షన్ సీన్స్ ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.

ఈ క్లైమాక్స్ ఫైట్ సినిమాలో మెయిన్ హైలెట్ గా నిలుస్తుంది అని చెబుతున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

Dada Movie Climax Fight Update