సాయి పల్లవి పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఉండాల్సిన లక్షణం
Sai Pallavi Reveals Her Dream Husband
మలయాళ కుట్టి సాయి పల్లవి ఇప్పుడు నార్త్ నుంచి రామాయణ తో మెప్పించడానికి సిద్దమైంది. సీత గా సాయి పల్లవి లుక్స్, ఆమె కేరెక్టర్ కి రామాయణ ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. రామాయణ ప్రమోషన్స్ తో నేషనల్ వైడ్ గా హైలెట్ అవుతున్న సాయి పల్లవి తాజాగా తాను పెళ్లి చేసుకోబోయేవాడికి ఉండాల్సిన లక్షణాలను రివీల్ చేసింది.
అమితాబ్ హోస్ట్ లో ప్రసారమవుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి 18 లో సాయి పల్లవి పాల్గొంది. ఆ షో లో అమితాబ్ పెళ్లి చేసుకునే వ్యక్తికీ ఉండాల్సిన ఆర్గత, అతనిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనుకుంటున్నారు అని అడిగితె.. దానికి సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ గా సమాధానమిచ్చింది.
తాను పెళ్లి చేసుకోవాలని అనుకున్న వ్యక్తి మంచి మనిషి అయి ఉండాలి. ఎప్పుడూ తన గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి కాకూడదు, తాను చేసిన తప్పులను గుర్తించి రియలైజ్ అవ్వాలి, మనిషి అనేవాళ్ళు తప్పు చెయ్యకూడా ఉండరు, కానీ చేసిన తప్పు నుంచి మంచి నేర్చుకోవాలి, సరిదిద్దుకోవాలి.
తాను తప్పు చేసి ఇతరులను నిందించకూడదు. ఇక తనకు కాబోయే భర్తకు వంట చేయడం కూడా వచ్చి ఉంటే బావుంటుంది అంటూ సాయి పల్లవి ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
















































