ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nara Rohith missing in Aadarsha Kutumbam Promotions

ఆదర్శంలో నారా సందడేదీ..!

Nara Rohith missing in Aadarsha Kutumbam PromotionsNara Rohith missing in Aadarsha Kutumbam Promotions

 

ఆదర్శ కుటుంబంలో వెంకటేష్ మాత్రమే కాదు మరో హీరో ఉన్నాడన్న సంగతి గుర్తుందా, అదేనండి నారా రోహిత్ కూడా ఉన్న విషయం తెలిసిందే కదా. పోలీస్ ఆఫీసర్ గా నారా రోహిత్ కనిపిస్తున్నట్లుగా ట్రైలర్ లో రివీల్ చేశారు. కానీ ఆదర్శ కుటుంబం ప్రమోషన్స్ లో నారా వారి హీరో సందడి అసలు కనిపించడం లేదు.

రేపు శుక్రవారం విడుదల కాబోతున్న ఆదర్శ కుటుంబం ప్రమోషన్స్ చాలా ఆచితూచి నిర్వహిస్తున్నారు. ఆ కొద్ధి ప్రమోషన్స్ లోను వెంకటేష్ హీరోయిన్స్ శ్రీనిధి శెట్టి, నివేత పేతురేజ్ లు తప్ప నారా రోహిత్ కనిపించిన సందర్భమే లేదు. ఇంటర్వూస్ అటుంచి ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎక్కడా నారా వారబ్బాయి కనబడలేదు.

పోలీస్ కేరెక్టర్ అంటే ఆ పాత్ర కు ఎంతోకొంత ప్రాధాన్యత ఉంటుంది. కానీ నారా రోహిత్ ప్రమోషన్స్ కి రానన్నాడో, లేదంటే వీళ్లే పిలవలేదో కానీ ఆదర్శ కుటుంబం ప్రమోషన్స్ లో నారా రోహిత్ మిస్సింగ్ ని ఆయన అభిమానులు ఫీలయ్యేలా చేసింది. 

Nara Rohith