వసూళ్ల పోస్టర్లకు దూరం.. కారణం వెనుక మాస్టర్ ప్లాన్?
Staying away from collection posters-is there a master plan behind it?సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం `జైలర్ 2` కలెక్షన్ పోస్టర్ల విషయమై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. సాధారణంగా అగ్ర హీరోల సినిమాలు విడుదలైనప్పుడు మేకర్స్ ప్రతి రోజు బాక్సాఫీస్ వసూళ్లకు సంబంధించిన పోస్టర్లను అధికారికంగా షేర్ చేస్తూ ఉంటారు. అయితే `జైలర్ 2` విషయంలో మాత్రం సన్ పిక్చర్స్ సంస్థ రెగ్యులర్‌గా అలాంటి కలెక్షన్ పోస్టర్లను విడుదల చేయకపోవడం ప్రేక్షకుల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ వ్యూహానికి ప్రధాన కారణం సినిమా వసూళ్లపై పారదర్శకత పాటించడమేనని తెలుస్తోంది. చిత్ర పరిశ్రమలో కొన్నిసార్లు అతిగా ప్రచారం చేసే వసూళ్ల నంబర్ల వల్ల అనవసరమైన ట్రోల్స్, వివాదాలు తలెత్తుతుంటాయి. ఈ రకమైన నెగెటివిటీకి దూరంగా ఉండాలని..అలాగే ట్రేడ్ వర్గాలు అధికారికంగా లెక్కించే జెన్యూన్ ఫిగర్స్‌కే ప్రాధాన్యత ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
అంతేకాకుండా సినిమాకు వస్తున్న మౌత్ టాక్ ..థియేటర్లలో ప్రేక్షకుడి నుండి లభిస్తున్న ఆదరణే అసలైన సక్సెస్ పోస్టర్ అని యూనిట్ నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి హంగామా లేకుండా కంటెంట్ మీదే ఫోకస్ పెడుతున్న సన్ పిక్చర్స్ నిర్ణయం పట్ల ట్రేడ్ పండితులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఏదేమైనా? కలెక్షన్ పోస్టర్ల ట్రెండ్‌కు భిన్నంగా సంస్థ అవలంబిస్తున్న కొత్త పద్ధతి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
















































