ఫైనల్లీ పెద్దిపై జాన్వీ తీవ్ర అసంతృప్తి
Finally Janhvi reacts to Peddi controversy
పెద్ది చిత్రం గత జూన్ లో విడుదలైంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కేరెక్టర్ కి ఎంత మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయో, హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర పై అంతకు మించిన విరమర్శలొచ్చాయి. ఆమెను గ్లామర్ డాల్ లా వాడేసాడు దర్శకుడు బుచ్చి బాబు, ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్ర సరే, కానీ అంతగా అందాలు చూపించడం ఎందుకు..
అందుకే జాన్వీ కపూర్ పెద్ది ప్రమోషన్స్ లో కనిపించలేదు అనుకున్నారు. అయితే పెద్ది విమర్శలపై జాన్వీ కపూర్ ఎప్పుడు, ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు, మౌనంతోనే కనిపించింది. తాజాగా జాన్వీ కపూర్ పెద్ది లోకి తన కేరెక్టర్ పై వచ్చిన విమర్శలపై స్పందించింది. అలాంటి సన్నివేశాలు సమాజంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయనడంలో సందేహం లేదు, ఈ పాత్ర అవమాన భారాన్ని లైఫ్ లాంగ్ మోయాల్సింది నేను.
నా పాత్రను అసభ్యకరంగా చూపించారు అనే విషయం నేను ఒప్పుకుంటాను, నేను పాత్ర ఎంపిక చేసేటప్పుడు ఆలోచించాల్సింది, నేను మరికాస్త జాగ్రత్తగా ఉండాల్సింది అంటూ జాన్వీ కపూర్ పెద్ది చిత్రంలో తన పాత్ర పై వచ్చిన విమర్శల్లో తప్పులేదు, ఆ పాత్రను డిజైన్ చేసినవారిదే తప్పు అని చెప్పకనే చెప్పింది.
















































