అధికారులను నిద్రపోనివ్వని సీఎం
AP: Cyclone Arnab damages
గత రెండు రోజులుగా ఏపీ లోని పలు జిల్లాల్లను అర్నాబ్ తుఫాన్ అతలాకుతలం చేసింది. సముద్రతీర ప్రాంతమైన నరసాపురం, కాకినాడ, యానాం, విశాఖలకు అర్నాబ్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కోనసీమ జిల్లాలు చిగురుటాకులా కాదు భారీ వృక్షాలు నెలకొరిక భయానకంగా మారిపోయింది. రోడ్ల మీద చెట్లు కూలిపోయి, ఇళ్లపై చెట్లు కూలి, కరెంట్ స్తంభాలు నేలకొరిగి ఇలా అర్నాబ్ భీబత్సం చెప్పనలవి కాదు.
రైల్వే ట్రాక్స్ తెగిపోయి, ట్రైన్స్ ఆపేసి, రోడ్ల ధ్వంశం అవడంతో RTC బస్సులు నిలిపేసి, కరెంట్ లేక నీళ్లు లేక కోనసీమ జిల్లాలు నరకాన్ని చూస్తున్నాయి. 36 గంటలుగా కరెంట్ లేక ఇంటర్నెట్ లేక కోనసీమ జిల్లాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. అసలు అక్కడి భీకర దృశ్యాలు చూస్తే ఇప్పట్లో కరెంట్ రాదు, నీళ్లు కూడా ఉండవనే అనుకున్నారు. కానీ 36 గంటల్లో అధికారులను అప్రమత్తం చెయ్యడం, వారితో నిద్ర లేకుండా పని చేయించడంలో ఏపీ సీఎం చంద్రబాబు సక్సెస్ అయ్యారు.
కాకినాడ, పాలకొల్లు, సముద్ర తీర ప్రాంతాల్లో గత అర్ధరాత్రికే చెట్లు తొలగించి కరెంట్ పోల్స్ సరిచేసి విద్యుత్ సరఫరాను అందించేయ్యడం అందరికి షాక్ ఇచ్చింది. అసలు ముఖ్యమంత్రి నిద్ర పోయారా, అధికారులను ఆయన ఎంతగా పరుగులు పెట్టించారో అన్ని గంటల్లోనే అమర్చారు, ఇది చూస్తే సీఎం ఇంకా అధికారుల డెడికేషన్ అర్ధమవుతుంది. ఇదంతా గమనించిన ప్రజలు నిజంగా ఏపీ సీఎం చంద్రబాబు గ్రేట్ అంటూ మాట్లాడుకుంటున్నారు.
అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మినిస్టర్ నారా లోకేష్ లు ఎప్పటికప్పుడు పరిస్థితిని కనుక్కుంటూ అధికారులను అప్రమత్తం చేస్తూ పరిస్థితులను చక్కబెడుతున్నారు.
















































