జాన్వీపై శిఖర్ ప్రేమ ఎంత ఘాడమైందంటే?
Janhvi Kapoor and Shikhar Pahariya's untold love storyబాలీవుడ్ నటి శ్రీదేవి అకస్మిక మరణం తర్వాత జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితుల గురించి నటి జాన్వీ కపూర్-శిఖర్ పహారియా ఓ టాక్ షోలో వెల్లడించారు. తల్లిని కోల్పోయి మానసిక వేదనలో ఉన్న సమయంలో శిఖర్ పహారియా తనకు ఎలా అండగా నిలిచారో గుర్తు చేసుకున్నారు.
ఆ సమయంలో లండన్లో చదువుకుంటున్న శిఖర్ పహారియా.. జాన్వీ ఒంటరిగా ఉందనే ఉద్దేశంతో చదువును మధ్యలోనే వదిలి ముంబైకి వచ్చారు. జాన్వీని ప్రతిరోజూ కలవకపోయినా.. ఒకవేళ ఎప్పుడైనా సహాయం అవస రమైతే అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ముంబైలోని జుహు ప్రాంతంలో స్నేహితుడి ఇంట్లో నెల రోజుల పాటు రహస్యంగా ఉన్నట్లు జాన్వీ చాలాకాలం తర్వాత తెలుసుకున్నానని తెలిపారు.
జాన్వీ కపూర్.. కష్ట సమయాల్లో శిఖర్ అందించిన నిస్వార్థమైన మద్దతు తన జీవితంలో ఎంతటి భద్రతా భావాన్ని కలిగించిందో వివరించారు. టీనేజ్ వయసు నుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని, తన కలలే శిఖర్ కలలుగా భావించే జీవితంలో సేఫ్ స్పేస్లా మారారని తెలిపారు. ఈ సంఘటన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరించింది.
















































