విజయ్ ని తొక్కేందుకే ధనుష్ ని దువ్వుతున్న బీజేపీ

Vijay vs Dhanush Clash BuzzVijay vs Dhanush Clash Buzz


కోలీవుడ్ స్టార్ హీరో సీఎం అవడం అక్కడి రాజకీయపార్టీలు ముఖ్యంగా బిజెపి అస్సలు ఓర్చుకోలేకపోతుంది. మాజీ సీఎం స్టాలిన్ కానీ, AIADMK కానీ విజయ్ ని సీఎం గా ఒప్పుకొలేకపోతున్నాయి. టీవీకే పార్టీ పోటీ చేసిన చాలా స్థానాల్లో గెలుపొందడం, అలియన్స్ తో అధికారం లోకి రావడం బిజెపి కి నచ్చలేదు. మొదటి నుంచి విజయ్ బిజెపికి వ్యతిరేఖంగానే ఉన్నారు. ఎన్నికల సమయంలో బిజెపి ఆఫర్ ని విజయ్ తిరస్కరించారు.

అందుకే ఇప్పుడు విజయ్ ని తొక్కడానికి బిజెపి మరో స్టార్ హీరో ధనుష్ తో కలిసి పావులు కదుపుతుంది అనే వార్త తమిళనాడు రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. హీరో ధనుష్ రీసెంట్ గా ఢిల్లీ వెళ్లి రాజకీయ సమావేశాలు నిర్వహించడం, మహిళా అభిమాన సంఘాలతో మీటింగ్ పెట్టడం అన్ని ఆయన పొలిటికల్ ఎంట్రీకి డోర్స్ తెరుస్తున్నవే.

అయితే ధనుష్ AIADMK పార్టీలో చేరబోతున్నారు, ఈ ప్లాన్ వెనుక బిజెపి ఉంది, AIADMK లోకి ధనుష్ ని దించి విజయ్ పైకి పంపాలనేది బిజెపి ప్లాన్, అందులో భాగంగా  EPS కుమారుడు మిథున్‌తో ఇప్పటికే మూడుసార్లు చర్చలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా పార్టీలో ధనుష్‌కు యూత్ వింగ్ బాధ్యతలు లేదా కీలక పార్టీ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. 

AIADMK backs actor Dhanush amid speculation of political entry