మహేష్ నిర్ణయానికి ఉన్న సమయం!
What is Mahesh Babu's Plan after Varanasi?సూపర్‌స్టార్ మహేష్ `వారణాసి` షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా పనులు జరుగుతున్నా? ఈ సినిమా తర్వాత మహేష్ ఏ దర్శకుడితో కలిసి చేస్తారనే అంశంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే రాజమౌళి సినిమా పూర్తయ్యే వరకు తదుపరి ప్రాజెక్ట్‌పై ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదని మహేష్ భావిస్తున్నారు.
`వారణాసి` ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తర్వాత మహేష్ సాధించబోయే గ్లోబల్ ఇమేజ్ ఆధారంగానే తదుపరి అడుగులు ఉండనున్నాయి. రాజమౌళి చిత్రాల ద్వారా కథానాయకులకు లభించే అంతర్జాతీయ గుర్తింపు ఎలాంటిదో? ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రపంచ స్థాయిలో తన మార్కెట్ ...ఇమేజ్ పరిధిని అంచనా వేసుకొని దానికి సరిపోయే తరహాలోనే నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఎంచుకోవాలని మహేష్ ప్రణాళికతో ఉన్నారు.
ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు ఇతర భాషలకు చెందిన పలువురు దిగ్గజ దర్శకులు మహేష్‌తో సినిమా చేసేందుకు వరుసలో ఉన్నారు. నిరంతరం ఆయనతో టచ్‌లో ఉంటూ రకరకాల ఆలోచనలు పంచుకుంటున్నా? మహేష్ మాత్రం పేర్లను బట్టి ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పడం లేదు. ఎంతటి క్రేజీ డైరెక్టర్ అయినా? తన వద్దకు తీసుకొచ్చే కథ సరికొత్తగా ఉండి వినగానే వావ్ అనిపించేలా ఉంటేనే ముందుకు వెళ్లాలని నిబంధన పెట్టుకున్నారు.
గత చిత్రాల శైలికి భిన్నంగా గ్లోబల్ ఆడియన్స్ అందరినీ అలరించే వినూత్న కథాంశాలకే మహేష్ తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. స్క్రిప్ట్ విషయంలో రాజీ పడకుండా పూర్తిస్థాయిలో సంతృప్తి చెందిన తర్వాతే తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకచే ఆలోచనలో ఉన్నారు. ఏది ఏమైనా? `వారణాసి` విడుదల తర్వాతే మహేష్ నెక్స్ట్ లెవెల్ కెరీర్ ల్యాండ్‌స్కేప్ ఆవిష్కృతం కానుంది
















































