కింగ్ 100 ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్

King 100 OTT partner fixedKing 100 OTT partner fixed


డిసెంబర్ 24 న రిలీజ్ కి సిద్దమవుతున్న సీనియర్ హీరో నాగార్జున 100 వ ఫిలిం #King100 చిత్రం షూటింగ్ సైలెంట్ గా చేసుకుంటుంది. అప్ డేట్స్ ఆచి తూచి వదులుతున్నారు మేకర్స్. దసరా ఫెస్టివల్ కు టబు గ్లింప్స్ వదులుతామని ఊరించి ఊరించి ఉసూరుమనిపించారు. నాగ్ బర్త్ డే గ్లింప్స్ తప్ప మరో డేట్ లేదు.

సినిమా విడుదలకు కరెక్ట్ గా రెండు నెలల సమయమే ఉంది. దానితో వేకప్ కింగ్ అంటూ అక్కినేని అభిమానుల ప్రెజర్ ఎక్కువైంది. తాజాగా #King100 కి సాలిడ్ అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. #King100 డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది.

ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ కూడా త్వరలోనే కంప్లీట్ అవ్వబోతుంది అని.. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. 

King 100 OTT partner finalized