విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ ఓటీటీ లోకి!

Baththa OTT streaming date fixedBaththa OTT streaming date fixed


కోలీవుడ్ విజయ్ సేతుపతి మెయిన్ లీడ్ లో బాలాజీ తరణీతరణ్ తెరకెక్కించిన బత్తా చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ చూసి తెలుగు ప్రేక్షకులు బత్తా చిత్రాన్ని తమిళంలోనే వీక్షించేందుకు థియేటర్స్ కి వెళ్లారు అంటే ఆ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అర్ధమవుతుంది.

అక్టోబరు 1న ఈ మూవీ తమిళ థియేటర్స్ లో విడుదలై అద్భుతమైన హిట్ గా నిలిచిన బత్తా చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కన్ఫామ్ చేసుకుంది. బత్తా చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ నుంచి ఈనెల 29 నుంచి స్ట్రీమింగ్ లోకి రాబోతున్నట్టుగా ప్రకటించారు.

అట్లీ సమర్పణలో తెరకెక్కిన బత్తా నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 29 నుంచి తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి రానుంది. 

Baththa is set to premiere on Netflix on October 29