పొలిటికల్ గా ధనుష్ స్పీడ్
Dhanush’s political momentum
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రెండేళ్లకే ఆయన సీఎం గా అధికారంలోకి రావడంతో చాలామంది స్టార్స్ పొలిటిక్స్ వైపు అడుగులు వెయ్యడం మొదలు పెడుతున్నారు. అందులో భాగంగా హీరో ధనుష్ రాజకీయ అరంగేట్రానికి ఆల్రెడీ అడుగులు వెయ్యడం మొదలు పెట్టేసారు. వారం క్రితం ఢిల్లీ వేదికగా ధనుష్ పొలిటికల్ మీటింగ్స్ హైలెట్ అయ్యాయి.
ఈలోపే ధనుష్ శరవేగంగా పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నట్టుగా అర్ధమయ్యేలా ఈరోజు చెన్నై లోని షోలింగ నల్లూరు లో మహిళా అభిమానులతో కలిసి సమావేశం నిర్వహించబోతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా ధనుష్ మహిళా అభిమాన సంఘాలను ఈరోజు ధనుష్ కలవబోతున్నాయి. దానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళతో కలిసి సమావేశం ఏర్పటు చెయ్యడమే కాదు వాళ్లతో కలిసి ఫోటోస్ కూడా తీసుకోబోతున్నారు.
మరోపక్క ధనుష్ అభిమానులను కలిసి రాజకీయంగా వేగంగా పావులు కదుపుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ధనుష్ అతి త్వరలోనే రాజకీయాల్లోకి రావాలని అభిమానుల ఒత్తిడి నేపథ్యంలో ధనుష్ నిర్వహిస్తున్న ఈ పొలిటికల్ మీటింగ్స్, అభిమాన సంఘాలతో కలిసి సమావేశాలు నిర్వహించడం అన్ని అతని స్పీడు కి నిదర్శనం.
















































